Home » Train Accident
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఆ మంటల్లో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) అనే వ్యక్తి చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మిగిలిన ప్రయాణికులు అందరూ కిందకు దిగిపోయి తమ ప్రాణాలను కాపాడుకున్నారు
బీ 1, ఎమ్ 2 కంపార్ట్మెంట్లలో అగ్నిప్రమాదం జరిగినట్లు గుర్తించామనిఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. నర్సింగబల్లి వద్ద B1 ఏసీ బోగికి బ్రేక్‌లు పట్టేయడంతో మంటలు చెలరేగాయని అన్నారు.
టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ (18189) రైలులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన లోకో పైలట్లు గుర్తించి ఎలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. ప్రాణ భయంతో ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. ఈ లోపు లోకో పైలట్ బోగీలను రైలు నుంచి వేరు చేశారు.. దీంతో పెను ప్రమాదం తప్పింది.
మెక్సికోలో ఇంటర్‌ఓషియానిక్ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 13 మంది మృతి చెందగా, 98 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.
టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే ఈ రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి.
అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది. రైలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పట్టాలపై కూర్చొని మద్యం సేవిస్తుండగా.. రైలు ఢీ కొట్టింది.
గత వారం భారతదేశం అనేక పెద్ద ప్రమాదాలను, ఘోర విషాదాలను చవిచూసింది. దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన ఘోర ప్రమాదాలు ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నాయి.
కోర్బా పాసింజర్ రైలు గూడ్సు రైలును ఢీకొనడంతో పాసింజర్ రైలు మొదటి బోగీ గూడ్సు రైలుపైకి ఎక్కినట్టు ఘటనా స్థలికి చెందిన వీడియోల్లో తెలుస్తోంది. ఘటన జరిగిన పెద్దఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు.
పట్టాలు దాటుతున్న యువకులను హైస్పీడు రైలు ఢీకొట్టినట్టు స్థానికుల సమాచారం. రైల్వే క్రాసింగ్ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? రైలు వేగంగా వస్తున్న విషయం తెలిసినా పట్టాలు దాటేందుకు యువకులు ప్రయత్నించడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఓ రైలు ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరుతోంది. ఇంతలో ఓ వ్యక్తి చేతిలో గిటార్ పట్టుకుని పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. అప్పటికే రైలు ముందుకు కదులుతోంది. అయినా ఆ వ్యక్తి ఎలాగైనా ఆ రైలును ఎక్కాలనే ఉద్దేశంతో పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే..