Share News

Train Derailment: పట్టాలు తప్పిన రైలు.. 13 మంది మృతి, 98 మందికి గాయాలు

ABN , Publish Date - Dec 29 , 2025 | 10:17 AM

మెక్సికోలో ఇంటర్‌ఓషియానిక్ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 13 మంది మృతి చెందగా, 98 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.

Train Derailment: పట్టాలు తప్పిన రైలు.. 13 మంది మృతి, 98 మందికి గాయాలు
Mexico Train Derailment

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 29: మెక్సికో దేశ దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలోని ఆసున్సియోన్ ఇక్స్టాల్టెపెక్ సమీపంలోని నిజాండా ప్రాంతంలో ఇంటర్‌ఓషియానిక్ రైలు (పసిఫిక్-గల్ఫ్ కోస్ట్ లైన్) పట్టాలు తప్పి ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 13 మంది మృతి చెందగా, 98 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.


రైలులో సుమారు 250 మంది ప్రయాణికులు (241 ప్రయాణికులు, 9 మంది సిబ్బంది) ఉన్నారు. ఓక్సాకా-వెరాక్రూజ్ మధ్య లైన్ Z మార్గంలో కర్వ్ తీసుకుంటుండగా రైలు పట్టాలు తప్పి దాదాపు 7 మీటర్ల లోతైన గుంటలో పడిపోయింది.


ఈ రైలు మెక్సికో నేవీ నిర్వహిస్తోంది. 2023లో ప్రారంభమైన ఈ మెగా ప్రాజెక్ట్.. పనామా కెనాల్‌కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన కారిడార్. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్, ఓక్సాకా గవర్నర్ సాలమోన్ జారా క్రూజ్ బాధిత కుటుంబాలను పరామర్శించారు.


సైన్యం, సివిల్ ప్రొటెక్షన్, అత్యవసర సేవలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద కారణాలపై మెక్సికో అటార్నీ జనరల్ ఆఫీస్ దర్యాప్తు ప్రారంభించింది.



ఇవీ చదవండి:

సూపర్.. ప్రపంచంలో నెం.3 స్థానానికి చేరిన వెండి! ఏకంగా..

వామ్మో.. భగ్గుమన్న బంగారం, వెండి ధరలు

Updated Date - Dec 29 , 2025 | 11:34 AM