Share News

Elamanchili train accident: ఎలమంచిలి ట్రైన్ యాక్సిడెంట్.. చనిపోయే ముందు భార్యకు ఫోన్ చేసి..

ABN , Publish Date - Dec 29 , 2025 | 03:37 PM

ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఆ మంటల్లో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) అనే వ్యక్తి చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మిగిలిన ప్రయాణికులు అందరూ కిందకు దిగిపోయి తమ ప్రాణాలను కాపాడుకున్నారు

Elamanchili train accident: ఎలమంచిలి ట్రైన్ యాక్సిడెంట్.. చనిపోయే ముందు భార్యకు ఫోన్ చేసి..
Elamanchili rail tragedy

అనకాపల్లి జిల్లా యలమంచిలికి సమీపంలో ఆదివారం ఆర్ధరాత్రి ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ మంటల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తీవ్రంగా మంటలు చెలరేగడంతో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఆ మంటల్లో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) అనే వ్యక్తి చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మిగిలిన ప్రయాణికులు అందరూ కిందకు దిగిపోయి తమ ప్రాణాలను కాపాడుకున్నారు (Vijayawada man dies).


చంద్రశేఖర్ బీ1 కంపార్ట్మెంట్లో బీ12 బెర్త్‌లో ఉన్నారు. చంద్రశేఖర్ తనతో పాటు విజయవాడకు రూ. 5 లక్షలకుపైగా నగదు, బంగారం తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదం జరిగిన క్షణంలో చంద్రశేఖర్ తన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించారు. డబ్బులు, బంగారం కోసమే చంద్రశేఖర్ రైల్లో ఉండిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ క్రమంలో దట్టమైన పొగ వల్ల ఊపిరి ఆడక మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు (Elamanchili rail tragedy).


రైల్వే పోలీసులు చంద్రశేఖర్‌ కుటుంబసభ్యుల సమక్షంలో ఆ బ్యాగును తెరిచి చూడగా, అందులో రూ.5.80లక్షల నగదు, బంగారం ఉన్నట్లు గుర్తించారు (Andhra Pradesh train mishap). అయితే, దురదృష్టవశాత్తు చాలా వరకు నోట్ల కట్టలు మంటల్లో కాలిపోయాయి. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే, రైల్వే అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. సామర్లకోట స్టేషన్‌లో ప్రయాణికుల కోసం బోగీలను సిద్ధం చేశారు. ప్రయాణికులను సామర్లకోట రైల్వే స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే శాఖ విచారణ జరుపుతోంది.


ఇవి కూడా చదవండి..

బట్టలు లేకుండా తాగుతూ, తూగుతూ.. బ్రిటన్‌లో వెరైటీ న్యూ ఇయర్ పార్టీ..


మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ Qల మధ్యలో O ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Dec 29 , 2025 | 03:57 PM