Bold New Year Party: బట్టలు లేకుండా తాగుతూ, తూగుతూ.. వెరైటీ న్యూ ఇయర్ పార్టీ..
ABN , Publish Date - Dec 29 , 2025 | 02:59 PM
ఇటీవల క్రిస్‌మస్ సెలబ్రేషన్స్‌ను ఘనంగా జరుపుకున్న బ్రిటన్ న్యూ ఇయర్‌కు రెడీ అవుతోంది. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉండే ఓ హోటల్ కొత్త సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలకబోతోంది. న్యూడ్ థీమ్‌తో న్యూ ఇయర్ పార్టీకి రెడీ అవుతోంది.
మరో సంవత్సరం కాల గర్భంలో కలిసిపోతోంది. 2025 సంవత్సరం మరో రెండ్రోజుల్లో పూర్తి కాబోతోంది. సరికొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ప్రపంచం అంతా సమాయత్తమవుతోంది. ఇటీవల క్రిస్‌మస్ సెలబ్రేషన్స్‌ను ఘనంగా జరుపుకున్న బ్రిటన్ న్యూ ఇయర్‌కు రెడీ అవుతోంది. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉండే ఓ హోటల్ కొత్త సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలకబోతోంది. న్యూడ్ థీమ్‌తో న్యూ ఇయర్ పార్టీకి రెడీ అవుతోంది (no clothes new year party).
బర్మింగ్‌హామ్ వాసులు ప్రకృతికి దగ్గరగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో బర్మింగ్‌హామ్‌లోని క్లోవర్ స్పా అండ్ హోటల్ నిర్వాహకులు న్యూడ్ న్యూ ఇయర్ పార్టీని ప్లాన్ చేశారు. ఆ పార్టీకి డ్రెస్ కోడ్ కాదు.. అసలు డ్రెస్సే ఉండదు. ఈ హోటల్‌లో క్రిస్మస్ సందర్భంగా, జంటల కోసం ప్రత్యేక పార్టీలు, మసాజ్ సెషన్‌లు, విందు కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు న్యూ ఇయర్ కోసం న్యూడ్ పార్టీని ప్లాన్ చేశారు. ఇక్కడ అతిథులు నూతన సంవత్సరాన్ని నగ్నంగా స్వాగతిస్తారు (bold party theme).
ఈ పార్టీకి హాజరవ్వాలనుకుంటే ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి (unconventional new year celebration). ఈ పార్టీ విషయంలో ఎలాంటి భయమూ అక్కర్లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ఖచ్చితంగా సామాజికమైనది, సురక్షితమైనదని హోటల్ యాజమాన్యం స్పష్టం చేసింది. లైంగిక కార్యకలాపాలకు అనుమతి లేదని, వాతావరణం పూర్తిగా స్నేహపూర్వకంగా ఉంటుందని తెలిపారు. అలాగే ఈ పార్టీలోకి 18 ఏళ్లు నిండిన వారికే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇది రైలా లేక మిసైలా.. గంటకు 700 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ రైలు గురించి తెలుసా..
వైద్య ప్రపంచంలోనే అద్భుతం.. పాదం మీద చెవి పెట్టి కాపాడారు..