Ernakulam Express Accident: అందుకే బోగీలో మంటలు వచ్చాయి: ఎస్పీ తుహీన్ సిన్హా
ABN , Publish Date - Dec 29 , 2025 | 07:58 AM
టాటానగర్ నుండి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ (18189) రైలులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన లోకో పైలట్లు గుర్తించి ఎలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. ప్రాణ భయంతో ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. ఈ లోపు లోకో పైలట్ బోగీలను రైలు నుంచి వేరు చేశారు.. దీంతో పెను ప్రమాదం తప్పింది.
అనకాపల్లి(Anakapalli) దగ్గర రైలులో నిన్న రాత్రి సుమారు 1:30 గంటల సమయంలో.. టాటా నగర్ (Tata Nagar )నుండి ఎర్నాకుళం (Ernakulam ) వెళ్తున్న టాటా - ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ (Train No. 18189) లో అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. ఇది గమనించిన లోకో పైలట్ (Loco Pilot)ట్రైన్‌ని ఎలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశాడు. రైలు ప్రమాదాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా మాట్లాడుతూ.. B1,M2 కంపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఒక కంపార్ట్మెంట్‌లో 82 మంది, మరో కంపార్ట్మెంట్‌లో 76 మంది ప్రయాణికులు (Passengers) ఉన్నారని తెలిపారు.
నర్సింగబల్లి వద్ద B1 ఏసీ బోగికి బ్రేక్‌లు పట్టేయడం(Brake Binding) వల్ల మంటలు(Fire) వచ్చాయి.. ఆ బోగీలో దుప్పట్లు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ బోగీలో ఉన్న చంద్రశేఖర్ సుందర్ (70) మృతి చెందారు. ఈ విషయం గురించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం. ప్రయాణికుల బంధువులు ఆందోళన చెందల్సిన అవసరం లేదు.. ప్రయాణికుల సమాచారం తెలుసుకోవాలనుకుంటే 139 కి కాల్ చేయాల్సిందిగా కోరారు. ఎలమంచిలి రైల్వే ప్రమాదంలో అగ్నికి దగ్ధమైన, రెండు కోతులను తొలగించి మిగతా ట్రైన్‌ని సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. రైలులో రెండు కోచ్‌లను విడిచి టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో బయలుదేరిందని తెలిపారు.
ఇవీ చదవండి
ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..
మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై పన్ను పోటు ఎంత