Train Collision: రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:11 PM
కోర్బా పాసింజర్ రైలు గూడ్సు రైలును ఢీకొనడంతో పాసింజర్ రైలు మొదటి బోగీ గూడ్సు రైలుపైకి ఎక్కినట్టు ఘటనా స్థలికి చెందిన వీడియోల్లో తెలుస్తోంది. ఘటన జరిగిన పెద్దఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు.
జైరామ్‌నగర్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని బిలాస్‌పూర్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం (Train Accident) చోటుచేసుకుంది. జైరామ్‌నగర్ స్టేషన్ సమీపంలో గూడ్సు రైలును పాసింజర్ రైలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కోర్బా పాసింజర్ రైలు గూడ్సు రైలును ఢీకొనడంతో పాసింజర్ రైలు మొదటి బోగీ గూడ్సు రైలుపైకి ఎక్కినట్టు ఘటనా స్థలికి చెందిన వీడియోల్లో తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే పెద్దఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. అధికారులు హుటాహుటిన సహాయక కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
హిందుజా గ్రూప్ చైర్మన్ కన్నుమూత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి