Gopichand Hinduja: హిందుజా గ్రూప్ చైర్మన్ కన్నుమూత
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:26 PM
హిందుజా సోదరులలో అగ్రజుడైన గోపీచంద్ చాలాకాలంగా అస్వస్థతతో ఉన్నారు. వాణిజ్య వర్గాల్లో 'జీపీ'గా పేరుపొందిన ఆయన హిందుజా కుటుంబంలో రెండో తరానికి చెందిన వారు.
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపార సంస్థ హిందుజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందుజా (Gopichand P Hinduja) కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. లండన్‌లోని ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ వర్గాలు తెలిపాయి.
హిందుజా సోదరులలో అగ్రజుడైన గోపీచంద్ చాలాకాలంగా అస్వస్థతతో ఉన్నారు. వాణిజ్య వర్గాల్లో 'జీపీ'గా పేరుపొందిన ఆయన హిందుజా కుటుంబంలో రెండో తరానికి చెందిన వారు. 2023 మేలో తన సోదరుడు శ్రీచంద్ మరణాంతరం గ్రూప్ సంస్థలకు చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. గోపీచంద్‌కు భార్య సునీత, కుమారుడు సంజయ్, ధీరజ్‌లు ఉన్నారు.
గోపీచంద్ 1959లో ముంబై జైహింద్ కాలేజీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అదే ఏడాది ఫ్యామిలీ బిజినెస్‌లో చేరారు. ఇండో-మిడిల్ ఈస్ట్ ట్రేడింగ్ ఆపరేషన్ల విషయంలో కీలకంగా వ్యవహరించారు.
ఇవి కూడా చదవండి..
సినిమాల్లో సామాజిక స్పృహ కొరవడింది..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి