Delhi HC: ఆ నిబంధన వద్దే వద్దు
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:46 AM
కనీస హాజరుశాతం లేదన్న సాకుతో పరీక్షలు రాయకుండా న్యాయ విద్యార్థులకు అనుమతి నిరాకరించొద్దని దేశంలోని న్యాయ కళాశాలలకు...
న్యాయ విద్యార్థులకు కనీస హాజరుపై ఢిల్లీ హైకోర్టు తీర్పు
న్యూఢిల్లీ, నవంబరు 3: కనీస హాజరుశాతం లేదన్న సాకుతో పరీక్షలు రాయకుండా న్యాయ విద్యార్థులకు అనుమతి నిరాకరించొద్దని దేశంలోని న్యాయ కళాశాలలకు ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విద్యార్థులకు తప్పనిసరి హాజరుశాతం నిబంధనపై ఆందోళన వ్యక్తం చేసిన జస్టి్‌సలు ప్రతిభా ఎం సింగ్, అమిత్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం తీర్పు చెబుతూ.. ఈ హాజరుశాతం నిబంధనను సవరించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ)కి సూచించింది. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి కానివ్వవద్దని పేర్కొంది. కనీస హాజరు శాతం లేనందున 2016 ఆగస్టులో పరీక్షలు రాసేందుకు కళాశాల యాజమాన్యం అనుమతి నిరాకరించడంతో అదేనెల 10న సుశాంత్ రోహిల్లా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో సుమోటో పిటిషన్‌పై హైకోర్టు ఈ తీర్పునిచ్చింది.