Share News

Thailand Train Accident: రైలుపై కూలిన క్రేన్.. 22 మంది మృతి

ABN , Publish Date - Jan 14 , 2026 | 10:32 AM

థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలుపై క్రేన్ కూలి పడటంతో అది పట్టాలు తప్పింది. ఈ ఘటనలో దాదాపు 22 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా 30 మందికి పైగా తీవ్ర గాయపడ్డారు.

Thailand Train Accident: రైలుపై కూలిన క్రేన్..  22 మంది మృతి
Thailand Train Accident

ఇంటర్నెట్ డెస్క్: థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలుపై క్రేన్ కూలి పడటంతో అది పట్టాలు తప్పింది. ఈ ఘటనలో దాదాపు 22 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా 30 మందికి పైగా తీవ్ర గాయపడ్డారు. ఈ ఘటన బ్యాంకాక్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న నఖోన్ రచ్చసీమ ప్రావిన్స్‌లోని సిఖియో జిల్లాలో బుధవారం ఉదయం జరిగింది.


ప్రమాద వివరాలను స్థానిక పోలీసు చీఫ్ థాచ్‌పోన్ చిన్నవాంగ్ వెల్లడించారు. ‘ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు. గాయపడిన వారి సంఖ్య 30కు మించవచ్చు’ అని ఆయన తెలిపారు. హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో భాగంగా పని చేస్తున్న నిర్మాణ క్రేన్ ఒక్కసారిగా కూలి రైలు బోగీ(Thailand train accident)పై పడటంతో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఒక బోగీలో స్వల్పంగా మంటలు చెలరేగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి:

మరో 34 పరుగుల దూరంలో.. రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!

గంభీర్‌తో రో-కోకు ఎలాంటి విభేదాలు లేవు.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Jan 14 , 2026 | 11:19 AM