WPL 2026: చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. తొలి భారత బ్యాటర్‌గా!
ABN , Publish Date - Jan 14 , 2026 | 09:14 AM
డబ్ల్యూపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది. మొత్తంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్లలో హర్మన్ రెండో స్థానంలో ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: డబ్ల్యూపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 71 పరుగులు చేసి జట్టును ఏడు వికెట్ల తేడాతో విజయతీరాలకు చేర్చింది. ఈ ఇన్నింగ్స్‌తో డబ్ల్యూపీఎల్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది. మొత్తంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్లలో హర్మన్(1016 పరుగులు) రెండో స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ముంబై ఇండియన్స్‌కే చెందిన నాట్ సీవర్ బ్రంట్(1101పరుగులు) కొనసాగుతోంది.
గుజరాత్‌తో మ్యాచులో 193 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన ముంబైకి ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలినా, హర్మన్‌ప్రీత్(Harmanpreet Kaur) క్రీజులోకి వచ్చాక మ్యాచ్ దిశ పూర్తిగా మారిపోయింది. హర్మన్ విధ్వంసానికి గుజరాత్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. గుజరాత్‌తో మ్యాచులో 193 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన ముంబైకి ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలినా, హర్మన్‌ప్రీత్(Harmanpreet Kaur) క్రీజులోకి వచ్చాక మ్యాచ్ దిశ పూర్తిగా మారిపోయింది. హర్మన్ విధ్వంసానికి గుజరాత్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. నికోల్ కేరీ (23 బంతుల్లో 38*) చక్కటి సహకారం అందించింది.
గుజరాత్ పోరాటం వృథా
ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు జార్జియా వెర్‌హామ్ (33 బంతుల్లో, 43*), భారతి ఫుల్మాలి (15 బంతుల్లో, 36*) చివర్లో మెరుపులు మెరిపించారు. ఆరంభంలో బెత్ మూనీ 33 పరుగులతో పర్వాలేదనిపించింది. ఆయుషి సోని (11) రిటైర్ హర్ట్ అయింది. చివరి ఓవర్లలో వచ్చిన పరుగులు గౌరవప్రదమైన స్కోరు అందించినా, గుజరాత్‌కు మాత్రం ఓటమి తప్పలేదు.
డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక పరుగులు
నాట్ సీవర్ బ్రంట్- 1101 పరుగులు
హర్మన్‌ప్రీత్ కౌర్ - 1016 పరుగులు
మెగ్ లానింగ్ - 996 పరుగులు
ఎలీస్ పెర్రీ - 972 పరుగులు
షఫాలి వర్మ - 887 పరుగులు
ఇవి కూడా చదవండి:
మరో 34 పరుగుల దూరంలో.. రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
గంభీర్‌తో రో-కోకు ఎలాంటి విభేదాలు లేవు.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు