Share News

King Cobra Viral Video: 10 అడుగుల కింగ్ కోబ్రాను.. పైపుతో పట్టేశాడుగా.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో..

ABN , Publish Date - Aug 12 , 2025 | 07:29 PM

రెండిళ్ల మధ్యలోకి 10 అడుగుల కింగ్ కోబ్రా వచ్చింది. దీంతో భనం భయంతో పరుగులు తీశారు. చివరకు సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకున్నాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా.. ఓ ప్లాస్టిక్ పైపు, సంచితో అక్కడికి చేరుకున్నాడు. చివరకు పామును ఎలా పట్టాడో చూడండి..

King Cobra Viral Video: 10 అడుగుల కింగ్ కోబ్రాను.. పైపుతో పట్టేశాడుగా.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో..

పాములంటేనే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. అలాంటికి ఇక కింగ్ కోబ్రా వంటి ప్రమాదకరమైన పాములను చూస్తే ప్రాణాలు పోయినంత పనవుతుంటుంది. అయితే కొందరు మాత్రం ఇలాంటి పాములను సైతం ఎంతో చాకచక్యంగా పట్టుకుంటుంటారు. ఈ తరహా షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి 10 అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకున్న విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రెండిళ్ల మధ్యలోకి 10 అడుగుల కింగ్ కోబ్రా వచ్చింది. దీంతో భనం భయంతో పరుగులు తీశారు. చివరకు సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకున్నాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా.. జస్ట్ ప్లాస్టిక్ పైపు, ఓ సంచితో అక్కడికి చేరుకున్నాడు. సంచికి ప్లాస్టిక్ పైపును కట్టి.. పాము ఎదురుగా వెళ్లాడు.


పైపును కోబ్రా తలపై పెడుతూ అందులోకి వెళ్లేలా చేయాలని చూశాడు. అయితే కింగ్ కోబ్రా చాలా సేపు పైపులోకి వెళ్లకుండా అతడిని కాటేసేందుకు ప్రయత్నించింది. అయినా అతను ఎంతో చాకచక్యంగా పాము కాటు నుంచి తప్పించుకుంటూ దాన్ని పైపులోకి పంపించేందుకు ప్రయత్నించాడు. ఇలా చాలా సార్లు ప్రయత్నించి.. చివరకు ఎలాగోలా (Man catches king cobra with plastic pipe) పామును పైపులో నుంచి సంచిలోకి వెళ్లేలా చేశాడు. దీంతో అక్కడున్న వారంతా.. హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు.


ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. చూస్తుంటేనే ప్రాణాలు పోయేలా ఉన్నాయి’.. అంటూ కొందరు, ‘ఇతడి టాలెంట్‌కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7100కి పైగా లైక్‌‌లు, 7.28 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..

ప్రియురాలి అత్యుత్సాహం.. రెండో అంతస్తులో పరుగెత్తుకుంటూ రావడంతో..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 12 , 2025 | 07:29 PM