OMG Viral: ఆ గ్రామంలో పాము కుట్టినా ఏమీ కాదు. 700 ఏళ్లుగా ఎవరూ చనిపోలేదు.. కారణమిదే..
ABN , Publish Date - Aug 10 , 2025 | 09:09 PM
పాము కాటేస్తే ఎవరైనా వెంటనే ఆస్పత్రికి పరుగులు తీయడమో, ఆకు పసర్లు వేయడమే చేస్తారు. అయితే ఆ ఊరి వాళ్లను పాము కాటు వేసినా ఎలాంటి చికిత్సా తీసుకోరు. అయినా వారికి ఏమీ కాదట. గత 700 సంవత్సరాలుగా ఆ ఊ ఊరి పరిసర గ్రామాల్లో ఎవరూ పాము కాటుతో చనిపోలేదట. ఆ ఊరు ఎక్కడుంది, ఏమీ కాకపోవడానికి గల కారణం ఏంటి.. తదితర వివరాల్లోకి వెళితే..
సాధారణంగా విష సర్పం కరిస్తే గంటల వ్యవధిలో చికిత్స చేయించుకోవాలి. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. కానీ ఆ గ్రామంలో ఎవరిని పాము కరిచినా ఏమీ కాదు. పాము కాటేసినా ఎలాంటి మందులూ తీసుకోరు. అయినా వారికి ఏమీ కాదట. విచిత్రంగా అనిపిస్తున్నా కూడా ఇది పచ్చి నిజం. గత 700 ఏళ్లుగా ఆ గ్రామాల పరిధిలో ఒక్కరు కూడా పాము కాటుతో చనిపోలేదట. ఆ గ్రామం ఎక్కడ ఎక్కడ ఉంది.. పాము కాటేసినా ఏమీ కాకపోవడానికి కారణాలు ఏంటి.. తదితర వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) సహారన్‌పూర్ జిల్లాలోని జరోడా పండా గ్రామం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ గ్రామంతో పాటూ చుట్టు పక్కల కొన్ని గ్రామాల పరిధిలో ఎవరిని పాము కరిచినా ఏమీ కాకపోవడమే ఇందుకు కారణం. గత 700 ఏళ్లలో ఈ ప్రాంతంలో పాములు ఎవరిని కాటు (Snake Bite) వేసినా.. ఆకు పసర్లు వేయడం గానీ.. ఆస్పత్రికి వెళ్లడం గానీ చేయరట. ఎలాంటి వైద్యం తీసుకోకపోయినా కూడా ఈ గ్రామాల వారికి ఏమీ కాదట. జరోడా పండాతో పాటూ చుట్టు పక్కల 12 గ్రామాలపై బాబా నారాయణ దాస్ ఆశీర్వాదం ఉందని, అందుకే ఇలా జరుగుతోందనేది స్థానికుల నమ్మకం.

ఎవరీ నారాయణ దాస్..
బాబా నారాయణ్ దాస్ అనే వ్యక్తి 700 సంవత్సరాల క్రితం జరోడా పాండా గ్రామంలో ఉగ్రసేన్, భగవతి దంపతులకు జన్మించారు. నారాయణ్ దాస్ చిన్నప్పటి నుంచే శివుడికి భక్తుడు. అలాగే నారాయణ్ దాస్ బాబా అనేక ప్రదేశాల్లో తపస్సు కూడా చేశాడట. అనంతర కాలంలో ఆ బాబా తన 80 బిఘాల భూమిని విరాళంగా ఇచ్చాడట. అందులో శివాలయాన్ని కూడా నిర్మించారు. బాబాగా మారిన నారాయణ్ దాస్ తన సేవకుడు, గుర్రం, కుక్కతో కలిసి ఆలయ సమీపంలో సమాధి అయ్యారని భక్తులు చెబుతున్నారు. ఆయన భూమత ఒడిలో కలిసిపోయరని స్థానికుల నమ్మకం. ఈ సమాధిని భక్తులు జుడ్ మందిర్ అని పిలుస్తుంటారు.

పాము విషం ఎందుకు పనిచేయదంటే..
బాబా నారాయణ్ దాస్ ఆశీర్వాదం వల్ల అప్పటి నుంచి పాము విషం స్థానికులపై పని చేయదని చెబుతున్నారు. జరోడా గ్రామంతో పాటూ కిషన్‌పురా, జైపూర్, షేర్‌పూర్, ఘిసర్పాడి, చరథావాల్, ఖుస్రోపూర్, మోగ్లిపూర్, చోక్డా, ఘిస్సుఖేడ న్యాము గ్రామాల పరిధిలో ఎవరిని పాము కరిచినా ఏమీ కాదని అంటున్నారు. దీంతో ఈ బాబాను స్థానికులతో పాటూ అనేక మంది దేవుడిలా భావించి పూజలు చేస్తున్నారు.
గత 700 సంవత్సరాలలో ఈ గ్రామాల పరిధిలో పాము కాటుతో ఒక్కరు కూడా చనిపోలేదని స్థానికులు చెబుతున్నారు. బాబా ఆశీర్వాదం వల్ల ఎలాంటి మందులు లేకుండానే నయం అవుతుందని తెలిపారు. బాబా నారాయణ్ దాస్ సమాధిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలను బాబా తీరుస్తాడని నమ్ముతారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కాగా, ప్రస్తుతం ఈ గ్రామాలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి..
ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..
ప్రియురాలి అత్యుత్సాహం.. రెండో అంతస్తులో పరుగెత్తుకుంటూ రావడంతో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి