Share News

Watch Viral Video: ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లో వెళ్తే నేరుగా నరకానికే.. చూస్తే కళ్లు తేలేస్తారు..

ABN , Publish Date - Aug 14 , 2025 | 07:18 PM

గోడ చివరన ద్వారం వద్ద ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని రాసి ఉంది. దీంతో అక్కడున్న వారంతా.. ప్రమాదం జరిగిన సందర్భాల్లో భవనం నుంచి త్వరగా బయటపడడానికి ఏర్పాటు చేసిన ద్వారమేమో... అని అనుకున్నారు. చివరకు దగ్గరికి వెళ్లి చూసి షాక్ అవుతున్నారు..

Watch Viral Video: ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లో వెళ్తే నేరుగా నరకానికే.. చూస్తే కళ్లు తేలేస్తారు..

కళ్లెదురుగా ఏ చిన్న వినూత్న సంఘటన జరిగినా.. ఆ మరుక్షణమే అది వీడియో రూపంలో నెట్టింట సందడి చేస్తుంటుంది. వాటిలో కొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. తాజాగా, ఇలా అవాక్కయ్యే సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ బోర్డు చూసి దగ్గరికి వెళ్లిన వారికి షాకింగ్ సీన్ కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లో వెళ్తే నేరుగా నరకానికే’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద భవనంలో ఉన్న వారికి షాకింగ్ సీన్ కనిపించింది. గోడ చివరన ద్వారం వద్ద ఎమర్జెన్సీ ఎగ్జిట్ (Emergency exit) అని రాసి ఉంది. దీంతో అక్కడున్న వారంతా.. ప్రమాదం జరిగిన సందర్భాల్లో భవనం నుంచి త్వరగా బయటపడడానికి ఏర్పాటు చేసిన ద్వారమేమో... అని అనుకున్నారు.


ఎగ్జిట్ ఎలా ఉందో అని చూసేందుకు దగ్గరికి వెళ్లారు. తీరా అక్కడి దృశ్యం చూసి కళ్లు తేలేశారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వెలుపల.. బయటికి వెళ్లడానికి ఎలాంటి మెట్లనూ ఏర్పాటు చేయలేదు. అడుగు బయటపెడితే నేరుగా కిందకు పడిపోయేలా ఉంది. ఇలాంటి ద్వారాన్ని పూడ్చేయకుండా దానిపై ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని రాయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. కొందరు దీన్ని వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ ఎగ్జిట్‌లో వెళ్తే నేరుగా ఎమర్జెన్సీ వార్డుకే’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 57 వేలకు పైగా లైక్‌లు, 1.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 07:18 PM