Share News

Bull attack Video: అయ్యో.. ఎంత ఘోరం.. వృద్ధుడిని గాల్లోకి విసిరేసిన ఎద్దు.. వీడియో వైరల్..

ABN , Publish Date - Aug 14 , 2025 | 05:13 PM

ఓ వృద్ధుడు వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా.. మార్గ మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద ఎద్దు ఆ వృద్ధుడికి ఎదురుగా వచ్చింది. సమీపానికి రాగానే.. వృద్ధుడు దాన్ని పక్కకు తోలేందుకు ప్రయత్నించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Bull attack Video: అయ్యో.. ఎంత ఘోరం.. వృద్ధుడిని గాల్లోకి విసిరేసిన ఎద్దు.. వీడియో వైరల్..

పాదచారులపై వీధి కుక్కలు, ఎద్దులు తదితర జంతువులు దాడి చేయడం ఇటీవల తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంది. ఇలాంటి సందర్భాల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోవడం చూస్తున్నాం. ఈ తరహా షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఎద్దు దాడికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎదురుగా వచ్చిన వృద్ధుడిని 12 అడుగుల మేర గాల్లోకి విసిరేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘అయ్యో పాపం ఎంత ఘోరం జరిగింది’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పంజాబ్‌ (Punjab) ఫజిల్కా ప్రాంత పరిధిలోని బ్యాంక్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన రామ్‌రాజ్ అనే 70 ఏళ్ల వృద్ధుడు.. పూలు తెచ్చేందుకు ఆదివారం మార్కెట్‌కు బయలుదేరాడు. అయితే మార్గ మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద ఎద్దు ఆ వృద్ధుడికి ఎదురుగా వచ్చింది. సమీపానికి రాగానే.. వృద్ధుడు దాన్ని పక్కకు తోలేందుకు ప్రయత్నించాడు.


అయితే ఆ ఎద్దు నేరుగా వృద్ధుడి పైకి (Bull attacks Old man) దూసుకెళ్లింది. కొమ్ములతో ఎత్తి 12 అడుగుల మేర గాల్లోకి విసిరేసింది. చూస్తుండగానే ఆ వృద్ధుడు దూరంగా ఉన్న ఇటుకల కుప్పపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో వృద్ధుడి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి కుమార్తె మాట్లాడుతూ సోమవారం శివాలయానికి వెళ్లాల్సి ఉండడంతో తన తండ్రి పూలు తేవడానికి మార్కెట్‌కు వెళ్లాడని తెలిపింది. ఎద్దులు, కుక్కలు దాడి చేయడం తరచూ జరుగుతోందని స్థానికులు తెలిపారు.


తాజాగా ఢిల్లీలో వీధి కుక్కలను బెడదను తప్పించాలని, కుక్కలు కనిపించకుండా చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జుంత ప్రేమికులు సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహిస్తున్నారు. కాగా, వృద్ధుడిపై ఎద్దు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అయ్యో ఎంత ఘోరం జరిగింది’.. అంటూ కొందరు, ‘వీధుల్లో ఎద్దులు, కుక్కలు కనిపించకుండా చర్యలు తీసుకోవాలి’.. అంట మరికొందరు, వివి రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 34 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 05:13 PM