Share News

Auto Driver Jugaad Video: ఈ ఆటో డ్రైవర్ తెలివి మామూలుగా లేదుగా.. వరద నీటిలో ఇబ్బంది లేకుండా..

ABN , Publish Date - Aug 14 , 2025 | 09:39 PM

సాధారణంగా వర్షాకాలంలో ఆటోలు, బస్సులు ఎక్కే క్రమంలో వరద నీటిలో ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. ఇక రోడ్డుపై వరద నీరు ఎక్కువగా ఉన్న సమయంలో మరింత అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఓ ఆటో డ్రైవర్ వినూత్న ప్రయోగం చేశాడు..

Auto Driver Jugaad Video: ఈ ఆటో డ్రైవర్ తెలివి మామూలుగా లేదుగా.. వరద నీటిలో ఇబ్బంది లేకుండా..

కొందరు వాహనదారులు వినూత్న విన్యాసాలు చేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటే.. మరికొందరు వాహనదారులు వినూత్న ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇంకొందరైతే ఎవరూ చేయని విధంగా వినూత్న ఆవిష్కరణలు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వరద నీటిలో ప్రయాణికులు ఆటో ఎక్కేందుకు వీలుగా.. డ్రైవర్ చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘అడుగు తడవకుండా.. ఆటో ఎక్కొచ్చు..’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా వర్షాకాలంలో ఆటోలు, బస్సులు ఎక్కే క్రమంలో వరద నీటిలో ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. ఇక రోడ్డుపై వరద నీరు ఎక్కువగా ఉన్న సమయంలో మరింత అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఓ ఆటో డ్రైవర్ వినూత్న ప్రయోగం చేశాడు.


ఎలాగైతే విమానం ఎక్కేందుకు మెట్లతో కూడిన నిచ్చెనను ఉపయోగిస్తామో.. అలాగే ఆ ఆటోకు డ్రైవర్ (Driver Attached Ladder to Auto) ఓ నిచ్చెనను కట్టేశాడు. వరద నీటిలో వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన ఆపగానే.. ఆ నిచ్చెనను కిందకు దించేశాడు. ప్రయాణికులు దాని మీదుగా నడుచుకుంటూ ఆటోలోకి వెళ్తున్నారు. ఇలా వారు వరద నీటిలో కాలు పెట్టాల్సిన పని లేకుండా ఏర్పాట్లు చేశాడన్నమాట. ఇదంతా వ్యూస్, లైక్‌ల కోసం చేసినా కూడా ఇతడి వినూత్న ప్రయోగం అందరికీ తెగ నచ్చేసింది.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇది విమానం లాంటి ఆటో’.. అంటూ కొందరు, ‘ఈ ఆటో డ్రైవర్ తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 34 వేలకు పైగా లైక్‌లు, 7 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 09:40 PM