Share News

Woman Viral Video: పిల్లులు, కుక్కలు, పులులు కాదు.. ఈమె ఏం పెంచుతుందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:26 PM

రకారకాల జంతవులును పెంచుకునే వారిని చూస్తుంటాం. చివరికి క్రూర మృగాలను సైతం తమ వెంట తిప్పుకొనే వారిని చూస్తుంటాం. అయితే తాజాగా, ఓ మహిళ పెంచుకుంటున్న వాటిని చూసి జనం మొత్తం జడుసుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

Woman Viral Video: పిల్లులు, కుక్కలు, పులులు కాదు.. ఈమె ఏం పెంచుతుందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..

ఇళ్లల్లో పిల్లులు, కుక్కలు, కోళ్లు తదితరాలను పెంచుకోవడం చూస్తుంటాం. ఆఖరికి పులులు, సింహాలను సైతం మచ్చిక చేసుకునే వారిని కూడా చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ తన ఇంట్లో పెంచుకున్న వాటిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఈమెకు భయమంటే ఏంటో తెలీదనుకుంటా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బల్లి అంటే భయపడని వారు, దగ్గరికి వస్తే పారిపోని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. అయితే కొందరు వీటిని చేతులతో పట్టుకుంటుంటారు. ఇంకొందరు వీటిని వండుకుని తినడం కూడా చూస్తుంటాం. అయితే తాజాగా, ఓ మహిళ నిర్వాకం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.


ఈమె తన ఇంట్లో బల్లులను పెంచుకుంటోంది. అది కూడా ఒకటి కాదు రెండు కాదు.. (Large number of lizards in woman house) వందల సంఖ్యలో బల్లులను పోషిస్తోంది. ఈమె ఇంట్లో గోడల మీద ఎక్కడ చూసినా బల్లులే కనిపిస్తున్నాయి. ఇంట్లోకి వెళ్లిన ఆమె, గోడకు వేలాడదీసిన దుప్పట్లను తీయగా.. లోపల గుట్టలు గుట్టలుగా బల్లులు కనిపించాయి. బల్లలు పక్కనే ఉన్నా కూడా ఆమెలా కొంచెం కూడా భయం కనిపించదు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈమేంటీ మరీ విచిత్రంగా ఉందే’.. అంటూ కొందరు, ‘అవి కోళ్లు అనుకున్నావా.. పొట్టేళ్లు అనుకున్నావా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 3.94 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 05:26 PM