Share News

Currency Counting Scam: కరెన్సీ కౌంటింగ్‌లో కొత్త స్కాం.. వీరి తెలివితేటలు చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Aug 15 , 2025 | 08:10 PM

ఓ వ్యక్తి కరెన్సీ నోట్ల కట్టను తీసుకుని లెక్కపెడుతున్నాడు. అందులో 500 నోట్లు మొత్తం 100 ఉన్నాయి. అన్నీ లెక్కపెట్టి మొత్తం రూ.50వేలు కరెక్ట్‌గా ఉన్నాయని అనుకున్నాడు. అయితే తీక్షణంగా పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది..

Currency Counting Scam: కరెన్సీ కౌంటింగ్‌లో కొత్త స్కాం.. వీరి తెలివితేటలు చూస్తే నోరెళ్లబెడతారు..

ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ నడుస్తోంది. కొందరు డబ్బు కోసం ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఇంకొందరు ఎంతో తెలివిగా నేరాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మరికొందరు మన కళ్లను మనమే నమ్మలేని విధంగా మోసాలు చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. కరెన్సీ నోట్లను లెక్కింపులో వెలుగులోకి వచ్చిన కొత్త స్కాం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఇలాక్కూడా మోసం చేస్తున్నారా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కరెన్సీ నోట్ల కట్టను (currency notes Bundle) తీసుకుని లెక్కపెడుతున్నాడు. అందులో 500 నోట్లు మొత్తం 100 ఉన్నాయి. అన్నీ లెక్కపెట్టి మొత్తం రూ.50వేలు కరెక్ట్‌గా ఉన్నాయని అనుకున్నాడు. అయితే నోట్ల కట్టను అటూ, ఇటూ తిప్పే క్రమంలో అతడికి అనుమానం కలిగింది. నోట్లన్నింటినీ తీక్షణంగా పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది.


ఆ నోట్ల కట్టలో రెండు 500 నోట్లను సగానికి మడిచి, నోట్ల మధ్యలో నోట్లకు సరిపోయే సైజులో పెట్టేశాడు. ఆ కట్టలో నాలుగు నోట్లను తీసేసి, వాటి స్థానంలో ఈ రెండు నోట్లను సగానికి మడిచేసి అతికించారు. నోట్ల కట్టను ఒక వైపు నుంచి లెక్కపెట్టే వారికి ఎలాంటి డౌట్ రాదు. అయితే నోట్లను విడదీసి, ఒక్కొక్కటిగా లెక్కపెడితే మాత్రం ఇలాంటి మోసాన్ని సులభంగా గుర్తించవచ్చు.


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఇలాక్కూడా మోసం చేస్తున్నారా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి వింత మోసాన్ని ఇప్పుడే చూస్తున్నాం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8,600కి పైగా లైక్‌లు, 1.9 మిలియ్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 15 , 2025 | 08:10 PM