Share News

Metro Train Video: రైల్లో డోరుకు అడ్డంగా నిలబడ్డాడు.. చివరికి జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Aug 17 , 2025 | 04:38 PM

మెట్రో రైల్లో ఓ యువకుడు డోరు వద్ద నిలబడి ఉన్నాడు. ఎక్కి, దిగే వారికి అడ్డుగా నిలబడుతూ ఇబ్బంది పెడుతున్నాడు. స్టేషన్ రాగానే ఓ వ్యక్తి దిగేందుకు ప్రయత్నించగా.. చేయి అడ్డుపెట్టి అతన్ని దిగకండా చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Metro Train Video: రైల్లో డోరుకు అడ్డంగా నిలబడ్డాడు.. చివరికి జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

మెట్రో రైళ్లలో చాలా మంది చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు అందరి ముందూ హీరోల్లా బిల్డప్ ఇస్తూ తాము ఇబ్బంది పడడమే కాకుండా ఎదిటి వారిని కూడా ఇబ్బందుల్లో పడేస్తుంటారు. ఇంకొందరు వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మెట్రో రైల్లో డోరుకు అడ్డంగా నిలబడి.. . అందరినీ ఇబ్బంది పెట్టాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మెట్రో రైల్లో (Metro Train) ఓ యువకుడు డోరు వద్ద నిలబడి ఉన్నాడు. ఎక్కి, దిగే వారికి అడ్డుగా నిలబడుతూ ఇబ్బంది పెడుతున్నాడు. స్టేషన్ రాగానే ఓ వ్యక్తి దిగేందుకు ప్రయత్నించగా.. చేయి అడ్డుపెట్టి అతన్ని దిగకండా చేశాడు. దీంతో ఆ వ్యక్తి చేసేదేమీ లేక అతడి చేయి కింద నుంచి దూరి దిగిపోతాడు. ఆ తర్వాత కూడా అతను పక్కకు జరకుండా అలాగే నిలబడి ఉన్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వెనుకున్న వ్యక్తి.. (passenger kicking man) అతడిని కాలితో ఒక్క తన్ను తన్నుతాడు. దెబ్బకు అతను రైలు నుంచి ఫ్లాట్‌ఫామ్‌పైకి ఎగిరిపడ్డాడు.


కిందపడగానే షాకైన అతను.. ఒక్కసారిగా పైకి లేచి తన స్వెట్టర్ విప్పి పక్కన పడేస్తాడు. ఆ స్వెట్టర్‌ను అంతకు ముందే కిందకు దిగిన వ్యక్తి తీసుకుని, అక్కడి నుంచి పారిపోతాడు. స్వెట్టర్ విప్పిన యువకుడు.. తర్వాత తన షూలు చేతిలోకి తీసుకుని, తనను తన్నిన వ్యక్తి పైకి విసిరేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే రైలు కదులుతుంది. అయినా అతను కొంత దూరం వరకూ రైలును వెంబడించి.. తన్నిన వ్యక్తి పైకి షూలు విసరాలని చూశాడు. అయితే అది సాధ్యం కాక చివరికి ఆగిపోతాడు.


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. చూస్తుంటే ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీదడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే వారికి ఇలాగే జరగాలి’.. అంటూ కొందరు, ‘చాలా మంచయి సందేశం ఇచ్చారు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.50 లక్షలకు పైగా లైక్‌‌లు, 17.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 04:39 PM