Car Driver Funny Video: కోపాన్ని ఎక్కడపడితే అక్కడ చూపిస్తే ఇలాగే అవుతుంది.. రోడ్డుపై ఇతడి పరిస్థితి చూస్తే..
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:02 PM
ఓ వ్యక్తి కారులో వస్తుండగా.. ఎదురుగా మరో కారు వస్తుంది. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. మొదటి కారు డ్రైవర్‌కు కోపం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో అతను చేసిన పనికి చివరికి ఏం జరిగిందో చూడండి..
చాలా మంది సమయం, సందర్భం లేకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తుంటారు. కొందరు ఎక్కడపడితే అతిగా ప్రవర్తిస్తూ అందరికీ ఇబ్బంది కలిగిస్తుంటే.. మరికొందరు బహిరంగ ప్రదేశాల్లో ప్రాంక్ అంటూ చుట్టుపక్కల వారికి చిరాకు తెప్పిస్తుంటారు. ఇంకొందరు చీటికీ మాటికీ కోపం ప్రదర్శిస్తూ చివరకు ఇబ్బందుల్లో పడుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కారు డ్రైవర్ మరో కారు డ్రైవర్‌పై అనవసర కోపాన్ని ప్రదర్శించాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారులో వస్తుండగా.. ఎదురుగా మరో కారు వస్తుంది. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. మొదటి కారు డ్రైవర్‌కు కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే కారు నుంచి దిగి ఎదుటి కారు డ్రైవర్‌ను తిడుతూ దగ్గరికి వెళ్లాడు.
అయితే ఆ వ్యక్తి కారు దిగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. కారు వెళ్లిపోతుండడం చూసిన మొదటి వ్యక్తి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కారును వెనుక వైపు కాలితో తన్ని ( Man kicked the Car) తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. అయితే కాలితో తన్నే సమయంలో స్లిప్ అయిపోయి.. మొదటికే మోసం జరుగుతుంది. కాలు విపరీతంగా నొప్పి పుట్టడంతో చాలా సేపు ఇబ్బంది పడతాడు. ఈ క్రమంలో సరిగ్గా లేచి నిలబడలేకపోతాడు. ఇలా చాలా సేపు ఆ వ్యక్తి సతమతమవుతాడు.
ఇదంతా ఇంకో కారులో కూర్చున్న వారు గమనించి, తమ ఫోన్‌లో రికార్డ్ చేస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎక్కడపడితే అక్కడ కోపం చూపిస్తే ఇలాగే అవుతుంది’.. అంటూ కొందరు, ‘అరెరే.. ఇతడికి పెద్ద కష్టమే వచ్చిందే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4,800కి పైగా లైక్‌లు, 3.50 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..
కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి