Flood Water Hazards Video: రీల్స్ కోసం వరద నీటిలోకి దిగాడు.. చూస్తుండగానే..
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:40 PM
ఓ యువకుడు రీల్స్ చేయడం కోసం నది వద్దకు వెళ్లాడు. అక్కడ వరద నీరు పైనుంచి భారీ స్థాయిలో కిందకు దూకుతుంటుంది. ఈ క్రమంలో అతను వరద నీటిలోకి దిగి కెమెరాకు ఫోజులు ఇచ్చాడు. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రీల్స్ చేయని మనిషి లేడంటే అతిశయోక్తికాదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకూ ప్రతి ఒక్కరూ రీల్స్ చేయడం అలవాటుగా చేసుకున్నారు. కొందరైతే రీల్స్ కోసం ప్రాణాలు కూడా లెక్కచేయకుండా సాహసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది చివరకు తమ ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు. ఇలాంటి విషాద సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రీల్స్ కోసం వరద నీటిలోకి దిగాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని (Uttarakhand, Haridwar) రావసన్ నది వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు రీల్స్ చేయడం కోసం (man reeling in floodwater) నది వద్దకు వెళ్లాడు. అక్కడ వరద నీరు పైనుంచి భారీ స్థాయిలో కిందకు దూకుతుంటుంది. వినూత్నంగా రీల్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యక్తి.. కిందకు వెళ్లాడు.
సరిగ్గా వరద నీరు కిందకు దూకే స్థలంలో నిలబడి కెమెరాకు ఫోజులు ఇచ్చాడు. అంతటితో ఆగకుండా పూర్తిగా వరద నీటిలో మునుగుతూ కూర్చున్నాడు. ఇలా చాలా సేపు అక్కడే కూర్చుని వివిధ రకాల ఫోజులు ఇచ్చాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. అయితే వీడియోలో తెలిపిన ప్రకారం.. ఆ తర్వాత వరద నీరు పెరిగిపోవడంతో (man was swept away in the flood water) ఆ వ్యక్తి అందులో కొట్టుకుపోయాడని తెలిసింది.
ప్రమాదకరమని తెలిసినా కూడా అతను వరద నీటిలోకి దిగడంపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘తెలిసి తెలిసి ప్రాణాలు పోగొట్టుకోవడమంటే ఇదే’.. అంటూ కొందరు, ‘ఇలాంటి తప్పులు ఎవరూ చేయకండి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 17 వేల మందికి పైగా వీక్షించారు.
ఇవి కూడా చదవండి..
చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..
కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి