Home » Uttarakhand
రిషికేశ్‌లోని శ్యామ్‌పూర్ హాత్ ఏరియాలో ఎలుగుబంటి యువకుల వెంటపడింది. ఆ యువకులు అతి కష్టం మీద ఎలుగుబంటి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఔలి రోడ్డులో ఉన్న ఆర్మీ క్యాంప్‌లోని స్టోర్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల కమ్ముకోవడంతో అత్యవసర సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి.
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విష్ణుగఢ్- పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో రెండు లోకో రైళ్లు ఢీకొనగా.. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిద్రమత్తు, రాంగ్ రూట్, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
పదవుల కంటే ప్రజలకు సేవ చేయడమనేది వాజ్‌పేయి జీవితం అందరికీ నేర్పుతుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అటల్–మోదీ సుపరిపాలన యాత్ర బహిరంగ సభలో సీఎం ధామి మాట్లాడారు.
ఉత్తరాఖండ్‌లోని రాజాజీ నేషనల్ పార్క్ నుంచి ఏనుగులు సమీపంలోని హైవేపైకి రావడంతో కొన్ని నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈలోపు ఏనుగులు మళ్లీ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి.
బంగ్లాదేశీలు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. హిందూ పేర్లు పెట్టుకుని ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి ప్రభుత్వ పథకాల్ని అనుభవిస్తున్నారు. మరోవైపు, ఉత్తరాఖండ్‌లో సాధువులుగా మారువేషాలు వేసుకుని భక్తుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సనాతన ధర్మాన్ని వక్రీకరిస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లోని ఓ పాఠశాల దగ్గర భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. అల్మోరాలోని ఓ స్కూలు దగ్గర 20 కేజీల బరువున్న 161 జిలెటిన్ స్టిక్స్‌ను బాంబ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది.
ఉత్తరాఖండ్‌లోని ఓ స్కూల్ సమీపంలో జిలెటిన్ స్టిక్స్ లభించడం కలకలానికి దారి తీసింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఓ చిరుత పులి అటవీ ప్రాంతం నుంచి జనావాసంలోకి వచ్చింది. పోలీస్ స్టేషన్ వద్ద కలకలం సృష్టించింది. కుక్కను నోట కర్చుకెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.