Share News

Bihar Girls: రూ.20,000కే బిహార్ అమ్మాయిలు.. మంత్రి భర్త వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 03 , 2026 | 08:56 PM

సాహు చేసిన వ్యాఖ్యలు బీజేపీ నైజాన్ని చాటుతోందంటూ బిహార్‌లోని విపక్ష ఆర్జేడీ, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ విమర్శించాయి. బీజేపీ నేతలు రూ.10,000తో మహిళల ఓట్లు కొని, ఇప్పుడు బీహర్‌ నుంచి రూ.20,000-25,000కు అమ్మాయిలను తెస్తామని చెబుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు.

Bihar Girls: రూ.20,000కే బిహార్ అమ్మాయిలు.. మంత్రి భర్త వివాదాస్పద వ్యాఖ్యలు
Giridhal Lal Sahu

డెహ్రాడూన్: బిహార్ అమ్మాయిలపై ఉత్తరాఖండ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య భర్త గిరిధారి లాల్ సాహు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రూ.20,000కే బిహార్ అమ్మాయిలు పెళ్లికి అందుబాటులో ఉన్నారని అల్మోరాలో జరిగిన ఒక కార్యక్రమంలో సాహూ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండటంతో ఆర్జేడీ, కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. దీంతో తన వ్యాఖ్యలపై సాహు క్షమాపణలు చెప్పగా, ఆయనతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ పేర్కొంది.


మంత్రి భర్త ఏమన్నారంటే..?

'మీరు వృద్ధాప్యంలో పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకోలేకపోతే మీ కోసం బిహార్ నుంచి అమ్మాయిని తీసుకొస్తాం. రూ.20,000 నుంచి రూ.25,000కే అక్కడి నుంచి అమ్మాయిలును తెచ్చుకోవచ్చు' అని సాహు అన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే సాహు స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తన మిత్రుడి వివాహాన్ని మాత్రమే తాను ప్రస్తావించానని చెప్పారు. అయితే తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే తాను క్షమాపణ చెప్పుకుంటున్నానని తెలిపారు.


సాహు చేసిన వ్యాఖ్యలు బీజేపీ నైజాన్ని చాటుతున్నాయని బిహార్‌లోని విపక్ష ఆర్జేడీ, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ విమర్శించాయి. బీజేపీ నేతలు రూ.10,000తో మహిళల ఓట్లు కొని, ఇప్పుడు బీహర్‌ నుంచి రూ.20,000-25,000కు అమ్మాయిలను తెస్తామని చెబుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. బిహార్ అన్నా, బిహార్ మహిళలన్నా బీజేపీ సపోర్టర్లకు ఇలాంటి విషపు ఆలోచనలే ఉంటాయన్నారు. దేశంలోని మహిళలను సాహు అవమానించారని, అధికార బీజేపీ క్షమాపణలు చెప్పాలని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్ గోడియాల్ డిమాండ్ చేసారు. బిహార్ మహిళా కమిషన్ సైతం స్పందించింది. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు గాను సాహుకు నోటీసులు పంపుతామని బీఎస్‌డబ్ల్యూఎస్ చైర్‌పర్సన్ అప్సర తెలిపారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో తన భార్య మంత్రిగా ఉండగా మహిళలపై ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం సాహు దివాళాకోరుతనాన్ని చాటుతుందని విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

బీజేపీని చూసి ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోలేరు: మోహన్ భగవత్

పోలింగ్‌కు ముందే 68 సీట్లలో మహాయుతి గెలుపు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 03 , 2026 | 09:16 PM