Shashi Tharoor: కూల్చివేతల డ్రైవ్ సరైనదే.. కర్ణాటక సర్కార్‌ను సమర్ధించిన శశిథరూర్
ABN , Publish Date - Jan 03 , 2026 | 06:15 PM
కూల్చివేతలతో పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందంటూ వస్తున్న విమర్శలను శశిథరూర్ తోసిపుచ్చారు. ఇందులో రాజకీయ ఉద్దేశాలేమీ లేవన్నారు. పేదరికం కోణం నుంచి ఈ అంశాన్ని చూడకూడదని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో చేపట్టిన ఇళ్ల కూల్చివేతల డ్రైవ్‌ను కాంగ్రెస్ తిరువనంతపురం ఎంపీ శశిథూరూర్ (Shashi Tharoor) సమర్ధించారు. చట్టపరమైన విధానాలను లోబడే జరుగుతోందని, నిర్వాసితులకు ప్రత్నామ్నాయ ఏర్పాట్లకు హామీ ఇచ్చారని చెప్పారు. బెంగళూరులో ఇళ్ల కూల్చివేతల డ్రైవ్‌పై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమమతున్న నేపథ్యంలో శిశథూరర్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కూల్చివేతల ఇళ్లు ప్రభుత్వ భూముల్లో కట్టుకున్నవేనని, అందులో చట్టవిరుద్ధంగానే అక్కడి వాళ్లు నివసిస్తున్నారని మీడియాతో మాట్లాడుతూ శశిథరూర్ చెప్పారు. 'మొదటిది అవి ప్రభుత్వ భూములు. రెండవది ఆ ఏరియా చెత్త పారవేసే ప్రాంతం. విషపూరిత వ్యర్థాలు అక్కడి జలాలను కలుషితం చేయడం వల్ల అది ఎంతమాత్రం సురక్షితం కాదు. నివసించడానికి కూడా యోగ్యం కాదు' అని ఆయన తెలిపారు. కూల్చివేతలకు సంబంధించి అక్కడ ఉంటున్న వారికి ముందుగానే నోటీసులు ఇవ్వడం జరిగిందని, నిర్వాసితులకు ప్రత్యామ్నాయ ఇళ్లుకు హామీ ఇచ్చారని చెప్పారు.
రాజకీయ ఉద్దేశాలేమీ లేవు
కూల్చివేతలతో పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందంటూ వస్తున్న విమర్శలను శశిథరూర్ తోసిపుచ్చారు. ఇందులో రాజకీయ ఉద్దేశాలేమీ లేవన్నారు. పేదరికం కోణం నుంచి ఈ అంశాన్ని చూడకూడదని పేర్కొన్నారు. లీగల్ పరంగా, ఆరోగ్య సంబంధిత ఆందోళనల పరంగా ఈ అంశాన్ని చూడాలని, ఇది పూర్తిగా ల్యాండ్ ఓనర్‌షిప్, పబ్లిక్ సేఫ్టీ అంశమని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీని చూసి ఆర్ఎస్ఎస్‌ను అర్ధం చేసుకోలేరు: మోహన్ భగవత్
పోలింగ్‌కు ముందే 68 సీట్లలో మహాయుతి గెలుపు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి