Share News

Newspapers Mandatory: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్స్‌లో న్యూస్ పేపర్ తప్పనిసరి

ABN , Publish Date - Jan 03 , 2026 | 02:44 PM

ప్రభుత్వ పాఠశాలల్లో న్యూస్ పేపర్ పఠనం తప్పనిసరి చేస్తూ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సామాజిక అవగాహన, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రెడీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Newspapers Mandatory: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్స్‌లో న్యూస్ పేపర్ తప్పనిసరి
Rajasthan government school news

జాతీయం, జనవరి 3: రాజస్థాన్ ప్రభుత్వం(Rajasthan Government ) సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో రోజూ వార్తా పత్రిక చదవడం తప్పనిసరి చేసింది. ప్రభుత్వ సెకండరీ పాఠశాలలు, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కనీసం రెండు వార్తాపత్రికలు తీసుకోవాలని తెలిపింది. అందులో ఒక హిందీ, ఒక ఇంగ్లీష్‌ పేపర్ల తప్పనిసరిగా సభ్యత్వం ఉండాలని తెలిపింది. విద్యార్థులలో పఠన అలవాట్లను ప్రోత్సహించడానికి, పదజాలాన్ని మెరుగుపరచడానికి, సాధారణ అంశాలపై అవగాహనను పెంపొందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


రాజస్థాన్ విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. విద్యార్థులు ఉదయం అసెంబ్లీలో కనీసం 10 నిమిషాలు వార్తాపత్రికలు(Newspapers Mandatory in Schools) చదవాలి. ఈ అలవాటు విద్యార్థులకు సమాజంలో జరిగే ప్రస్తుత వ్యవహారాలను పరిచయం చేయడం, అలానే వార్తలను అర్థం చేసుకునే, వాటిని విశ్లేషించే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఆదేశం ప్రకారం ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలు, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కనీసం రెండు వార్తాపత్రికలను, అందులోనూ ఒక హిందీ, ఒక ఇంగ్లీష్ పేపర్(Newspapers for students)ను తీసుకోవాలని ఆదేశించింది. అలానే ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలు కనీసం రెండు హిందీ వార్తాపత్రికలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపింది.


న్యూస్ పేపర్ల కొనుగోలు ఖర్చును రాజస్థాన్ స్కూల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(Education Council) భరిస్తుంది. పాఠశాల అసెంబ్లీ సమయంలో, ఆంగ్లంలో ఒక జాతీయ స్థాయి వార్తాపత్రిక, హిందీలో ఒకదాన్ని బిగ్గరగా చదవాలి. విద్యార్థులను తరగతుల వారీగా విభజించి, సంపాదకీయాలు, ప్రధాన జాతీయ, అంతర్జాతీయ, క్రీడా వార్తలను చదవడానికి, చర్చించడానికి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని విద్యాశాఖ ఉత్తర్వులో పేర్కొంది. ఈ కార్యక్రమం విద్యార్థుల సాధారణ జ్ఞానాన్ని, సమాజంపై అవగాహనను మెరుగుపరచడమే కాకుండా, వారిని పోటీ పరీక్షలకు మరింత మెరుగ్గా సిద్ధం చేయడానికి కూడా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. వారం క్రితం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం(Uttar Pradesh Government)పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Bengaluru News: కాలు దువ్వి.. కాంగ్రెస్‌ వారితో రగడకు..

Nara Pratap Reddy: ‘గాలి’పై నారా ఫైర్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

Updated Date - Jan 03 , 2026 | 02:44 PM