Pregnant Woman: ప్రసవం కోసం 6 కి.మీ నడిచిన నిండు గర్భిణీ.. చివరికి మృతి
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:50 AM
ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచిన ఓ గర్భిణీ కథ విషాదంగా ముగిసింది. తనకు పుట్టబోయే బిడ్డతో సంతోషంగా గడపాలని భావించిన ఆ తల్లి.. అదే బిడ్డతో సహా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే...
జాతీయం, జనవరి 3: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఓ నిండు గర్భిణి(Gadchiroli pregnant woman) 6 కిలోమీటర్లు నడిచింది. దీంతో తీవ్ర రక్తస్రావమై కడుపులో ఉన్న బిడ్డతో పాటు ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ అమానవీయ శుక్రవారం చోటుచేసుకుంది.
గడ్చిరోలి జిల్లా ఆల్దండి టోలో గ్రామానికి చెందిన ఆశా సంతోష్ కిరంగ(24)కు నెలలు నిండాయి. దీంతో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె నివాసముంటోన్న ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేదు. ప్రధాన రహదారికి చాలా లోపల ఉండటంతో వైద్య సదుపాయాలు కూడా లేవు. చేసేదేమీ లేక.. అక్కడే ఉంటే ప్రసవానికి ఇబ్బంది అవుతుందని భావించిన ఆమె.. నొప్పులు భరిస్తూనే అటవీ మార్గం గుండా సుమారు 6 కిలోమీటర్లు నడక సాగించింది. అలా తన సోదరి ఉండే పెథా గ్రామానికి చేరుకుందామె.
నడుచుకుంటూ రావడంతో కిరంగకు పురిటి నొప్పులు మరింత అధికమయ్యాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఆమెను హేద్రిలోని కాళీ అమ్మల్ ఆస్పత్రికి తరలించారు. కానీ.. తీవ్ర రక్తస్రావం(Pregnant woman blood loss) కావడంతో పాటు బీపీ అధికమై కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది. కాసేపటికే సంతోష్ కిరంగ కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో మృతురాలి భర్త, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రతాప్ షిండే స్పందించారు. డాక్టర్లు ఆమెను ప్రాణాలతో కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ఈ ఘటన(Tragic delivery incident Gadchiroli)పై విచారణ జరుపుతున్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Nagpur Child Incident: కొడుకు చెడు బుద్ధిని మార్చేందుకు పేరెంట్స్ దారుణం.. గొలుసులతో బంధించి
నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు