Nagpur Child Incident: కొడుకు చెడు బుద్ధిని మార్చేందుకు పేరెంట్స్ దారుణం.. గొలుసులతో బంధించి
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:04 AM
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దంపతులు తమ 12 ఏళ్ల కుమారుడిని దాదాపు 2 నెలల నుంచి ఇనుప గొలుసులతో బంధించారు. వారు చెప్పిన కారణం విని అధికారులతో సహా అంతా షాకయ్యారు.
మహారాష్ట్ర, జనవరి 3: నాగ్‌పూర్(Nagpur)లో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు తమ 12 ఏళ్ల కొడుకును(Child abuse case Nagpur) ఇనుప గొలుసులు, తాళాలతో కట్టేశారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే ఇద్దరు తల్లిదండ్రులు రోజూ పనికి వెళ్లే ముందు తమ 12 ఏళ్ల కుమారుడిని గొలుసులతో బంధించేవారు. ఇలా రెండు నెలలుగా జరుగుతుంది. అయితే తాజాగా స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా మహిళా, శిశు అభివృద్ధి కార్యాలయం నుండి వచ్చిన బృందం ఆ ఇంటిపై దాడి చేసినప్పుడు, మేడపై బాలుడి చేతులకు గొలుసులు, కాళ్లకు తాళం వేసి బంధించబడి కనిపించాడు. రెండు నెలలుగా గొలుసులతో బంధించడంతో బాలుడి చేతులు, కాళ్లపై గాయాలు కనిపించాయి. బాలుడు తీవ్ర భయాందోళనతో కనిపించాడు. అతడిని విడిపించిన అధికారులు సురక్షితమైన ప్రదేశానికి తరలించారు.
పేరెంట్స్ అలా ఎందుకు చేశారంటే...
తమ బిడ్డను గొలుసులతో బంధించడానికి గల కారణాన్ని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. తమ కొడుకు పాఠశాల మానేసి.. చాలా అల్లరి చేసేవాడని, తమ మాట వినడు, తరచుగా ఇంటి నుండి పారిపోతాడని తెలిపారు. అంతేకాక ఇతరుల నుండి మొబైల్ ఫోన్‌లను దొంగిలించేవాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అతని చెడు బుద్ధిని మార్చేందుకే చేతులు, కాళ్ళు కట్టివేసే చర్య తీసుకున్నారని తల్లిదండ్రులు తెలిపారు. మరోవైపు జువెనైల్ చట్టం(under juvenile laws) కింద బాలుడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయబడింది. బాలుడిని సురక్షితంగా అదుపులోకి తీసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC)కి పంపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు
ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల