Sankranti Gift: 8న సీఎం చేతులమీదుగా సంక్రాంతి గిఫ్ట్..
ABN , Publish Date - Jan 03 , 2026 | 10:48 AM
సంక్రాంతి పండుగను పురష్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే గిప్ట్ ఈనెల 8వ తేదీ నుంచి అందించనున్నారు. రాజధాని చెన్నైలో ముఖ్యమంత్రి స్టాలిన్, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అందజేయనున్నారు.
చెన్నై: సంక్రాంతి గిఫ్ట్ ప్యాకేజీ పంపిణీని ఈ నెల 8వ తేది ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) లాంఛనంగా ప్రారంభించనున్నారు. రేషన్‌కార్డుదారులకు ప్రతి ఏడాది సంక్రాంతి గిఫ్ట్ ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. గత ఏడాది సంక్రాంతికి రేషన్‌కార్డుదారులకు కిలో పచ్చి బియ్యం, చక్కెర, పూర్తిస్థాయి చెరుకుగడ అందించారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ మరో రెండువారాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో, 2.22 కోట్ల బియ్యం కార్డుదారులకు సంక్రాంతి గిఫ్ట్ ప్యాకేజీ ఇచ్చేందుకు సహకార, ఆహార శాఖ కార్యదర్శి సత్యప్రదసాహు గురువారం జీవో విడుదల చేశారు.

కానీ, అందులో నగదు పంపిణి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో, ఈ నెల 8వ తేది నగరంలో నిర్వహించనున్న కార్యక్రమంలో సంక్రాంతి గిఫ్ట్ ప్యాకేజీ పంపిణీని ముఖ్యమంత్రి స్టాలిన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గిఫ్ట్ ప్యాక్ పంపిణీ ప్రారంభించనున్నారు. అదే సమయంలో, గిఫ్ట్ ప్యాకేజీకి సంబంధించిన టోకెన్లు ముద్రించి సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి ఉత్తర్వులతో ఈ నెల 4,5 తేదీల్లో రేషన్ కార్డుదారులకు టోకెన్ల పంపిణీ ప్రారంభం కానుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు
ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల
Read Latest Telangana News and National News