Blue Dragon Fish: కాశిమేడు తీరంలో ‘బ్లూ డ్రాగన్’ చేపలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:14 AM
తమిళనాడు రాష్ట్రంలోని కాశిమేడు తీరంలో బ్లూ డ్రాగన్ చేపలు పెద్దఎద్దున కనిపించాయి. అయితే.. వీటిని చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో సముద్రం వద్దకు వచ్చారు. కాగా.. ఈ చేపల వల్ల హాని ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
చెన్నై: స్థానిక కాశిమేడు(Kashimedu) సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన ‘బ్లూ డ్రాగన్’ చేపలు చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. సముద్రజీవి బ్లూ డ్రాగన్ చేపల కాటుతో నొప్పులు, వాపు, వికారం, అలెర్జీ తదితరాలు వస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా, ఆ చేపలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వచ్చారు. గత ఏడాది స్పెయిన్‌లో కూడా బ్లూ డ్రాగన్ చేపలు తీరానికి కొట్టుకురావడంతో, బీచ్‌ను తాత్కాలికంగా మూసివేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు
ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల
Read Latest Telangana News and National News