Home » pregnant woman
నిండు గర్భిణి పట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్, నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది. ఈ దారుణం నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది.
తీవ్రమైన నొప్పులు, రక్తస్రావంతో నరక యాతన అనుభవిస్తున్న ఓ గర్భిణి బురదమయమైన రోడ్డుపై ఎడ్లబండిలో 2.5 కి.మీ ప్రయాణించడంతో ఆస్పత్రికి చేరుకునేలోపే గర్భస్థ శిశువు చనిపోయింది.
ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్తున్న ఆ గర్భిణికి ఆర్టీసీ బస్సే ఆస్పత్రి అయింది.. కండక్టర్ చొరవతో నర్సు డాక్టరయింది. వెరసి. పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది.
మెదక్ జిల్లా మనోహరాబాద్లోని జాతీయ రహదారిపై అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఏడు నెలల గర్భంతో ఉన్న ఓ మహిళ దుర్మరణం పాలవ్వగా.. ఆమె గర్భంలోని పిండం రహదారిపై పడి చిధ్రమైంది.
వాతావరణంలో మార్పు, పరిసరాలు శుభ్రత లేకపోవడం, దోమలు, కలుషితమైన నీటిని తీసుకోవడం, ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించకపోవడం ప్రధాన కారణాలు.
గర్భధారణ సమయంలో కరోనా(Covid 19) సోకిన మహిళలకు దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నాయని ప్రసూతి, గైనకాలజీ జర్నల్ ప్రచురించింది. కరోనా సోకిన ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలైన అలసట, జీర్ణకోశ సమస్యలు తదితరాలతో బాధపడుతున్నట్లు అధ్యయనం కనుగొంది.
తెలంగాణలోని పది జిల్లాల్లో గర్భస్రావాల (అబార్షన్లు) శాతం అధికంగా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు అన్ని జిల్లాల్లో నమోదైన గర్భిణుల్లో 10 శాతం మందికి అబార్షన్లు అయినట్లు తేలింది. ఈ విషయాన్ని తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఈ ఐదు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 2,84,208 మంది గర్భిణులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు అనేక రకాల ఇబ్బందులు తలెత్తుంటాయి. ఇలాంటి సమయాల్లో చాలా మంది వేడుక చూస్తారే గానీ.. సాయం చేసేందుకు ముందుకు రారు. కొందరైతే..
కరీంనగర్ బస్టా్పలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ సిబ్బంది పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. పుట్టిన ఆ పసికందుకు పుట్టిన రోజు కానుకగా జీవితకాలం ఉచిత బస్పా్సను మంజూరు చేస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.
ప్రసవానికి ఇంకా సమయం ఉందంటూ పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణిని 100 కి.మీల దూరంలో ఉన్న ఇంటికి తిప్పి పంపేశారు ఓ మాతాశిశు సంరక్షణ కేంద్రం అధికారులు. ఆ తర్వాత కొన్ని గంటలకే నొప్పులు ఎక్కువవడంతో ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో 108 వాహనంలోనే ఆ గర్భిణికి ప్రసవమైంది.