Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్.. 12 మంది నక్సల్స్ మృతి
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:27 AM
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఈ ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. దాదాపు 12 మంది నక్సల్స్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ అక్కడ కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సల్స్ మృతి చెందినట్టు తెలుస్తోంది. సుక్మా జిల్లాలో తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో కుంటా ఏరియా కమిటీకి చెందిన సచిన్ మంగ్డు మరణించినట్టు సమాచారం. ఆ ప్రాంతంలో భద్రతా దళాలు భారీ స్థాయిలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి (12 Naxals dead in Bijapur Encounter)).
నక్స్‌లైట్ల సంచారం ఉన్నట్టు సమాచారం అందడటంతో జిల్లాకు చెందిన రిజర్వ్ గార్డ్ పోలీసుల బృందం ఈ తెల్లవారుజామున రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే నక్సల్స్, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో గతేడాది వివిధ ఎన్‌కౌంటర్‌లలో 285 మంది నక్సల్స్ మృతి చెందారు. బస్తర్ డివిజన్ (ఏడు జిల్లాలు) 257 మంది మృతి చెందగా మిగతా 27 మంది రాయ్‌పూర్ డివిజన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లల్లో మరణించారు. ఇక తాజా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి:
అవినీతి ఆరోపణలు.. గుజరాత్ ఐఏఎస్ అధికారి అరెస్ట్
కొడుకు చెడు బుద్ధిని మార్చేందుకు పేరెంట్స్ దారుణం.. గొలుసులతో బంధించి