Nara Pratap Reddy: ‘గాలి’పై నారా ఫైర్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:11 PM
మాజీమంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై బళ్లారి అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ మాజీ అధ్యక్షుడు నారా ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వేష రాజకీయాలు ‘గాలి’కి అలవాటే.. అంటూ పేర్కొనడం గమనార్హం.
- ద్వేష రాజకీయాలు ‘గాలి’కి అలవాటే..
- ‘గాలి’పై బుడా మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి ధ్వజం
- పక్కా ప్లానింగ్‌తో దాడి చేశారని ఆరోపణ
బళ్లారి(బెంగళూరు): ద్వేష రాజకీయాలు గాలి జనార్దన్‌రెడ్డికి అలవాటేనని, పక్కా ప్లానింగ్‌తోనే ఆయన ఇంటి కాల్పులు జరిపి కాంగ్రెస్ కార్యకర్త మృతికి కారణమయ్యాడని గాలి జనార్దన్ రెడ్డిపై బుడా మాజీ అధ్యక్షుడు నారా ప్రతాప్ రెడ్డి(Nara Pratap Reddy) ఆరోపించారు. శుక్రవారం స్థానిక ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హావంబావి ఘటనపై ఆయన మాట్లాడారు. గాలి అనచరులు జరిపిన కాల్పులు కారణంగా తమ కార్యకర్త రాజశేఖర్ మృతిచెందడం బాధా కరమన్నారు.
వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠను భగ్నం చేసి నారా భరత్ రెడ్డికి అప్రతిష్ఠ తెచ్చేందుకే గాలి ఇలాంటి పన్నాగాలు పన్నారన్నారు. బళ్లారిలో గాలి బ్రదర్స్ రాకతోనే శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. 2008 నుండే రాజకీయ నాయకులకు ప్రైవేట్ సెక్యురిటీ పేరుతో హంగామా ప్రారంభమైందన్నారు. అప్పటి నుండే నగరంలో పెక్ల్సీ సంస్కృతి విచ్చల విడిగా పెరిపోయిందని, అదే కాల్పులు జరగడానికి కారణమైందన్నారు. నగరంలో గాలి సోదరులు అభివృద్ధి చేశారంటే రెండు టవర్ క్లాక్‌లు కూల్చడం మినహా మరేమి చేయలేదని, 35ఏళ్ళ యువకుడైన ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక, అడ్డుకోలేక పరోక్షంగా ఎమ్మెల్యేతో పోటీ పడలేక కావాలనే నగరంలో శాంతి భద్రతలకు అంతరాయం కలిగిస్తున్నారన్నారు.

గతంలో జిల్లా ఎన్‌ఎండీ, బ్రాహ్మణీ స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుకు సేకరించిన భూమిని మరొకరికి అమ్మి చేసుకోవడాన్ని ప్రశ్చించారు. నీవేమైనా జిల్లా అభివృద్దికి కృషి చేయాలంటే ఎన్‌ఎండిసి స్టీల్ ప్లాంట్ కోసం కృషిచేసి అభివృద్ధిని చూపాలి కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడరాదని హెచ్చరించారు. ఇదే పరిస్థితి నగరంలోకొనసాగితే గాలి తీయాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రగి నాగ రాజు, మేయర్ పి.గాదెప్ప, ప్రముఖులు ఎ. మానయ్య, బి.రామ్‌ప్రసాద్, వెంకటేష్ హెగ్డే, పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు
ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల
Read Latest Telangana News and National News