Bengaluru News: కాలు దువ్వి.. కాంగ్రెస్ వారితో రగడకు..
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:50 PM
గాలి జనార్దన్ రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగేంద్ర ధ్వజమెత్తారు. కాలు దువ్వి.. కాంగ్రెస్ వారితో రగడకు దిగారంటూ ఆయన ఆరోపించారు. కాగా.. బళ్లారిలో నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపుతోంది.
- గాలి జనార్దన్ రెడ్డిపై మాజీ మంత్రి నాగేంద్ర ధ్వజం
- మహర్షి వాల్మీకిని అవమానించారని మండిపాటు
బళ్లారి(బెంగళూరు): బీజేపీ నాయకుడు గాలి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలపై కాలు దువ్వి రగడకు దిగారని, మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠకు ప్లెక్సీలు వేస్తుంటే బీజేపీ నాయకులు జీర్ణించుకోలేక ఇలాంటి దుశ్చర్యకు పాల్పడారని మాజీ మంత్రి బి. నాగేంద్ర(B Nagendra) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బళ్లారిలో నాగేంద్ర, కంప్లి ఎమ్మెల్యే గనేష్, బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద చల్లాలనే బీజేపీ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, నారా భరత్‌రెడ్డి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి వాల్మీకులకు గౌరవం తెచ్చేలా చేస్తుంటే బీజేపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు. నారా భరత్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డిపై జనార్దన్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.

కేవలం ఫ్లెక్సీల ఘటనను కావాలనే కాల్పుల దాకా తెచ్చారన్నారు. ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణం బాఽధాకరమన్నారు. బళ్లారిలో ఇంతక మందు బీజేపీ నాయకులు బాంబులు వేసి బీహర్ తరహాలో చేశారన్నారు. ఇంటెలిజెంట్ పోలీసుల విచారణలో వాస్తవాలు బయటపడుతాయన్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు
ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల
Read Latest Telangana News and National News