లోయలో పడ్డ బస్సు.. ముగ్గురి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు..
ABN , Publish Date - Feb 04 , 2026 | 06:47 AM
ఉత్తరాఖండ్‌లో ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం డెహ్రాడూన్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
డెహ్రాడూన్, ఫిబ్రవరి 4: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం డెహ్రాడూన్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన ఓ బస్సు 30 మంది ప్రయాణికులతో హిమాచల్ ప్రదేశ్ నుంచి పొంత సాహిబ్ బయలుదేరింది. మంగళవారం ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలోకి ప్రవేశించింది.
కల్సీ ఏరియాలోని మీనక్ రోడ్డులో వెళ్తుండగా బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి.. పక్కనే ఉన్న 100 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 7 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలను చేపట్టాయి.
గాయపడ్డవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక, ఈ సంఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి టెలిఫోన్ ద్వారా అధికారులను ఆరా తీశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో విచారణ