Uttarakhand Train Accident: ఉత్తరాఖండ్‌లో ఢీకొన్న రెండు లోకో రైళ్లు.. 70 మందికి..
ABN , Publish Date - Dec 31 , 2025 | 10:36 AM
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విష్ణుగఢ్- పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో రెండు లోకో రైళ్లు ఢీకొనగా.. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఉత్తరాఖండ్, డిసెంబర్ 31: ఇటీవకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఎర్నాకుళం ట్రైన్ లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా.. పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విష్ణుగఢ్- పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో రెండు లోకో రైళ్లు ఢీకొనగా.. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు (Loco Train Collide In Uttarakhand). ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
నిన్న(మంగళవారం) రాత్రి 9:30 గంటలకు అక్కడ విధులు నిర్వహించే వారు.. షిప్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చమోలీ జిల్లా కలెక్టర్ గౌరవ్ కుమార్ పేర్కొన్నారు. సొరంగం(Tunnel Train) లోపలికి కార్మికులను, అధికారులను తీసుకెళ్తున్న లోకో ట్రైన్.. అదే సమయంలో పరికరాలను తీసుకెళ్తున్న మరో లోకో ట్రైను ఢీకొట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 109 మంది ఉన్నారని, వారిలో 70 మంది గాయపడ్డారన్నారని అధికారులు పేర్కొన్నారు. గాయపడిన వారిన చమోలీలోని ఆస్పత్రికి తరలించి చికిత్సకలెక్టర్ గౌరవ్ కుమార్ అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రమాదంపై జిల్లా ఎస్పీ సూర్జిత్ సింగ్ మాట్లాడుతూ.. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు ప్రారంభించామన్నారు. సొరంగం నుంచి కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని తెలిపారు. గాయపడిన వారిలో ఎక్కువమంది జార్ఖండ్, ఒడిశాకు చెందిన వారని అధికారులు తెలిపారు. ఇక, ఈ ప్రమాదానికి గల కారణాల(Railway Safety India)పై విచారణ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఘటన సమయంలో భద్రత, సిగ్నలింగ్ వ్యవస్థలో ఏదైనా లోపం ఉందా అనే కోణంలో పోలీసులు విచారించనున్నారని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ
మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలు