Fire in Army Camp Store: ఆర్మీ క్యాంపులో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:02 PM
ఔలి రోడ్డులో ఉన్న ఆర్మీ క్యాంప్‌లోని స్టోర్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల కమ్ముకోవడంతో అత్యవసర సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి.
జోషిమఠ్: ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని జోషిమఠ్‌లో శుక్రవారంనాడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఔలి రోడ్డులో ఉన్న ఆర్మీ క్యాంప్‌లోని స్టోర్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల కమ్ముకోవడంతో అత్యవసర సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు విస్తరించకుండా వెంటనే అదుపులోకి తెచ్చాయి. ప్రమాదానికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు.
గతంలోనూ..
గత ఏడాది మేలో కూడా లెహ్‌లోని డిగ్రీ కాలేజీ సమీపంలో ఉన్న ఆర్మీ క్యాంపులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు సమీపంలోని భవంతులకు విస్తరించడంతో స్థానిక పోలీసులు, ఆర్మీ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సమన్వయంతో మంటలను అదుపుచేశాయి. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదు. అయితే ప్రమాదానికి కారణాలను మాత్రం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. దీనికి మందు గత జనవరిలో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న ఆర్మీ క్యాంటిన్‌లోనూ అగ్నిప్రమాదం జరిగింది. బదామీ బాఘ్ కంటోన్మెంట్ ఏరియాలో జరిగిన ఈ ఘటనలో తీవ్రగాయలతో ఒక పౌరుడు మృతిచెందాడు.
ఇవి కూడా చదవండి..
విషం సరఫరా చేస్తున్నారు.. ఇండోర్‌లో కలుషిత తాగునీటి మరణాలపై రాహుల్ నిప్పులు
ఇండోర్‌లో దారుణం.. తాగు నీరు కలుషితం కావడంతో 10 మంది మృతి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి