Share News

S Jaishankar: మన పొరుగున చెడ్డోళ్లున్నారు.. పాక్‌పై జైశంకర్ పంజా

ABN , Publish Date - Jan 02 , 2026 | 04:10 PM

పొరుగుదేశాలతో నిర్మాణాత్మక సహకారానికి భారత్ కట్టుబడి ఉంటుందని, రెండ్రోజుల క్రితమే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా అంత్యక్రియలకు భారత్ ప్రతినిధిగా తాను ఢాకా వెళ్లాలని ఎస్ జైశంకర్ చెప్పారు.

S Jaishankar: మన పొరుగున చెడ్డోళ్లున్నారు.. పాక్‌పై జైశంకర్ పంజా
S Jaishankar

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ను నిరంతరం ఉగ్రవాదం ఎగదోస్తున్న 'చెడ్డ పొరుగుదేశం'గా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) అభివర్ణించారు. ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించుకునే హక్కు భారత్‌కు ఉందన్నారు. ఐఐటీ మద్రాసులో శుక్రవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు చేయాల్సినదంతా చేస్తామని, మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఇతరులు నిర్ణయించలేరని అన్నారు. వ్యూహాత్మకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


పొరుగుదేశాలతో నిర్మాణాత్మక సహకారానికి భారత్ కట్టుబడి ఉంటుందని, రెండ్రోజుల క్రితమే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా అంత్యక్రియలకు భారత్ ప్రతినిధిగా తాను ఢాకా వెళ్లాలని చెప్పారు. పొరుగుదేశాలకు సాయం అవసరమైనప్పుడల్లా భారత్ ముందుంటుందని అన్నారు. మంచి పొరుగువారు ఉంటే ఇండియా పెట్టుబడులు పెట్టడం, సాయం అందించడం వంటివి చేస్తుందన్నారు. కోవిడ్ సమయంలో వాక్సిన్ ఇచ్చామని, ఉక్రెయిన్ ఘర్షణల సమయంలో ఇంధనం, ఆహారం సరఫరా, ఆర్థిక సంక్షోభ సమయంలో శ్రీలంకకు 4 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేశామని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

విషం సరఫరా చేస్తున్నారు.. ఇండోర్‌లో కలుషిత తాగునీటి మరణాలపై రాహుల్ నిప్పులు

ఇండోర్‌లో దారుణం.. తాగు నీరు కలుషితం కావడంతో 10 మంది మృతి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 02 , 2026 | 04:13 PM