Share News

Chennai News: హెల్మెట్‌ ఉన్న వారికి వెండి నాణేలు..

ABN , Publish Date - Jan 02 , 2026 | 01:40 PM

హెల్మెట్‌ ఉన్న వారికి పొలీసులు వెండి నాణేలు అందజేశారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ఎంత అవసరమో వివరిస్తూ వెండి నాణేలను అందజేశారు. తంజావూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేలా జిల్లా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది.

Chennai News: హెల్మెట్‌ ఉన్న వారికి వెండి నాణేలు..

చెన్నై: హెల్మెట్‌ ధరించిన వాహనచోదకులకు పోలీసులు వెండి నాణేలు అందజేసి అభినందించారు. తంజావూరు(Tanjavuru) జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేలా జిల్లా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. అలాగే, రోడ్డు నిబంధనలపై వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్‌ ధరించిన వాహన చోదకులకు ఇటీవల అరటి పండ్లు, 50 మందికి ఉచితంగా హెల్మెట్లు అందజేశారు.


nani2.jpg

ఈ నేపథ్యంలో, నూతన సంవత్సరం సందర్భంగా నగర పోలీసు కమిషనర్‌ రవిచంద్రన్‌ నేతృత్వంలో పోలీసులు ఆట్రుపాలం సమీపంలోని అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్‌ ధరించిన 50 మందికి తలా 4 గ్రాముల వెండి నాణెం ఇచ్చి అభినందించారు. ఊహించని ఈ బహుమతికి వాహన చోదకులు ఆనందం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం

మరో 3.5 కిలోల బంగారం రికవరీ

Read Latest Telangana News and National News

Updated Date - Jan 02 , 2026 | 01:45 PM