నేపాల్‌లో తీవ్ర విషాదం.. బస్సు లోయలో పడి 13 మంది దుర్మరణం
ABN , Publish Date - Feb 06 , 2026 | 06:01 PM
నేపాల్‌లోని బైతాడి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బస్సు లోయలోపడి 13 మంది మృతిచెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ సరిహద్దు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్(Nepal) బైతాడి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు(Bus) అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13మంది అక్కడిక్కడే మృతిచెందగా.. 30మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఉత్తరాఖండ్(Uttarakhand) సరిహద్దు సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
మృతుల్లో ఎక్కువ మంది బజాంగ్ జిల్లా(Bajang District)కు చెందిన వారని ఖాట్మండు పోలీసులు తెలిపారు. బస్సు కొండపై ప్రయాణిస్తున్న సమయంలో బ్రేక్ పైపు (ప్రెషర్ పైపు) పగిలిపోవడంతో, డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని కొండ ప్రాంతాల్లో ప్రయాణాలు చేయడం ప్రమాదకరమని అధికారులు ఎంతగా చెప్పినా, ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!
అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..