Share News

దళపతి విజయ్‌కి షాక్ ఇచ్చిన కోర్టు.. ఆ పిటిషన్ కొట్టివేత

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:24 PM

దళపతి విజయ్‌కి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. విజయ్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. విజయ్ వేసిన రిట్ పిటిషన్‌పై జస్టిస్ సెంథిల్ కుమార్ శుక్రవారం విచారణ జరిపారు. ఆదాయ పన్ను శాఖకు అనుకూలంగా తీర్పునిచ్చారు.

దళపతి విజయ్‌కి షాక్ ఇచ్చిన కోర్టు.. ఆ పిటిషన్ కొట్టివేత
Vijay income tax penalty

చెన్నై, ఫిబ్రవరి 6: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత దళపతి విజయ్‌కి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. విజయ్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆదాయ పన్ను పెనాల్టీకి సంబంధించి విజయ్ వేసిన రిట్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్ కుమార్ శుక్రవారం విచారణ జరిపారు. ఆదాయ పన్ను శాఖకు అనుకూలంగా తీర్పునిచ్చారు. విజయ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..


2015 సంవత్సరంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు విజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత విజయ్ ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేస్తూ.. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తనకు 35.42 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు చూపించారు. అయితే పులి సినిమా కోసం ఆయన తీసుకున్న 15 కోట్ల రూపాయలు ఆ లెక్కలో చూపించలేదని అధికారులు గుర్తించారు. 1.5 కోట్ల రూపాయల పెనాల్టీ వేస్తూ 2022 జూన్ 30వ తేదీన నోటీసులు ఇచ్చారు.


ఆదాయ పన్ను శాఖ అధికారుల నోటీసులకు వ్యతిరేకంగా విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. సింగిల్ జడ్జి ఈ పిటిషన్‌పై విచారణ జరిపారు. ఆదాయ పన్ను శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా 2022 ఆగస్టు 16న ఇంటీరియమ్ స్టే వేశారు. శుక్రవారం ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరిగింది. జస్టిస్ సెంథిల్ కుమార్.. విజయ్ వేసిన పిటిషన్‌ను కొట్టి వేశారు.


ఇవి కూడా చదవండి

బాబోయ్‌.. పులి.. కుందారంలో పాదముద్రల గుర్తింపు

గడ్చిరోలిలో కాల్పుల కలకలం.. ముగ్గురు మావోయిస్టుల మృతి

Updated Date - Feb 06 , 2026 | 01:44 PM