Home » Nepal
తాజాగా నేపాల్ విడుదల చేసిన కొత్త వంద రూపాయల నోటు వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా నేపాల్ విడుదల చేసిన వంద రూపాయల నోటుపై ఆ దేశ మ్యాప్ ఉంది. అయితే ఆ మ్యాప్‌లో కాలాపానీ, లిపులేఖ్, లింపియాధుర భూభాగాలు ఉన్నాయి.
నేపాల్‌లో మళ్లీ యువత నిరసనల బాట పట్టింది. బారా జిల్లాలో సీపీఎన్-యూఎమ్ఎల్ నేతలు స్థానిక యువతపై దాడి చేయడంతో నిరసనలు మొదలయ్యాయి. దీంతో, పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలో గురువారం రాత్రి 8 గంటల వరకూ కర్ఫ్యూ విధించారు.
430 మిలియన్ కరెన్సీ నోట్ల ముద్రణ కాంట్రాక్ట్‌ను నేపాల్ తాజాగా చైనా ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించింది. దీంతో, ఈ రంగంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న తీరుపై మరోసారి చర్చ జరుగుతోంది.
చిన్న దేశాలు నిర్వహించే క్రికెట్ లీగ్స్ లో స్టార్ క్రికెటర్లు కూడా పాల్గొంటారు. అలానే తాజాగా నేపాల్ ప్రీమియర్ లీగ్(NPL)లోకి భారత్ స్టార్ క్రికెటర్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ లీగ్‌లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆడాడు. తాజాగా దేశవాలీ స్టార్ క్రికెటర్ అయిన ప్రియాంక్ పంచల్ కూడా ఎన్పీఎల్ లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఢిల్లీ పేలుళ్లలో పలువురు మృతులకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల వాంగ్‌చుక్ సంతాపం తెలిపారు. చాంగ్లిమిథాంగ్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మృతుల కు సంతాపం తెలుపుతూ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
మొన్నటి వరకూ జెన్ జెడ్ ఆందోళనతో అట్టుడికిన దాయాది దేశం నేపాల్.. ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమౌతోంది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాకాలం సెప్టెంబర్ చివరి వారంతో ముగిసినప్పటికీ..
నేపాల్‌లో నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం చిక్కుకుంది. కోట్ల సతీమణి, మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ, కూతురు నివేదిత మరికొందరు కలిసి ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మాసన సరోవరం యాత్ర కోసం ఈ నెల 5న హైదరాబాద్ నుంచి వెళ్లారు. 6వ తేదీన నేపాల్‌కు చేరుకున్నారు.
నేపాల్‌లో కల్లోల పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
జెనరేషన్ జెడ్ యువత ఆందోళనలతో అట్టుడికిన నేపాల్‌లో పరిస్థితులు కొలిక్కి వస్తున్నాయి. ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి....
నేపాల్‌లో కొద్దిరోజులుగా జన్ జీ నిరనసలు ఉవ్వెత్తున ఎగసిపడటం, పెద్దఎత్తున అల్లర్లు, దహనకాండం, హింస చోటుచేసుకోవడం, ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసి వెళ్లపోవడం వంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి.