Nandyal MLA Family Stuck In Nepal: నేపాల్‌లో చిక్కుకున్న నంద్యాల ఎమ్మెల్యే కుటుంబం

ABN, Publish Date - Sep 13 , 2025 | 11:32 AM

నేపాల్‌లో నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం చిక్కుకుంది. కోట్ల సతీమణి, మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ, కూతురు నివేదిత మరికొందరు కలిసి ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మాసన సరోవరం యాత్ర కోసం ఈ నెల 5న హైదరాబాద్ నుంచి వెళ్లారు. 6వ తేదీన నేపాల్‌కు చేరుకున్నారు.

నేపాల్‌లో నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం చిక్కుకుంది. కోట్ల సతీమణి, మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ, కూతురు నివేదిత మరికొందరు కలిసి ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మాసన సరోవరం యాత్ర కోసం ఈ నెల 5న హైదరాబాద్ నుంచి వెళ్లారు. 6వ తేదీన నేపాల్‌కు చేరుకున్నారు. యాత్రలో భాగంగా మానససరోవరానికి బయలుదేరడానికి బయలుదేరడానికి ముందు తమ వెంట తీసుకెళ్లిన లగేజీ వస్తువులు, కొంత నగదును అక్కడే ఓ హోటల్లో పెట్టి వెళ్లారు. ఆ సమయంలో నేపాల్‌లో జరిగిన అల్లర్లలో భాగంగా ఆందోళనకారులు ఆ హోటల్‌కు నిప్పటించడంతో ఆ మంటల్లో లగేజీ మొత్తం కాలి బూడిదైంది. ప్రస్తుతం కోట్ల సుజాతమ్మ క్షేమంగానే ఉన్నారు. వారిని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated at - Sep 13 , 2025 | 11:32 AM