Share News

Skateboarding Viral Video: స్కేట్ బోర్డింగ్ చేస్తున్నాడా.. కారు డ్రైవింగ్ చేస్తున్నాడా.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో..

ABN , Publish Date - Aug 17 , 2025 | 07:33 PM

ఓ విదేశీ పర్యాటకుడు స్కేట్ బోర్డింగ్ చేశాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా కూడా అతను స్కేటింగ్ చేస్తున్న స్థలమే అంతా ఆశ్చర్యపోవడానికి కారణమవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

Skateboarding Viral Video: స్కేట్ బోర్డింగ్ చేస్తున్నాడా.. కారు డ్రైవింగ్ చేస్తున్నాడా.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో..

స్కేటింగ్, స్కేట్ బోర్డింగ్ క్రీడలు చూసేందుకు బాగున్నా కూడా ప్రాక్టికల్‌గా చాలా కష్టం. ఎంతో అనుభవం ఉంటే తప్ప స్నేటింగ్ చేయడం సాధ్యం కాదు. కొందరు ఈ రెండు క్రీడలను ఎంతో అవలీలగా చేసేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఓ వ్యక్తి స్కేట్ బోర్డింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ప్రమాదంపై సవారీ చేయడమంటే ఇదే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) మనాలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ విదేశీ పర్యాటకుడు (Foreign tourist) స్కేట్ బోర్డింగ్ చేశాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా కూడా అతను స్కేటింగ్ చేస్తున్న స్థలమే అంతా ఆశ్చర్యపోవడానికి కారణమవుతోంది. సాధారణంగా ఎవరైనా ప్రత్యేకంగా తయారు చేసిన మార్గంలో స్కేట్ బోర్డింగ్ చేస్తుంటారు.


కానీ ఇతను మాత్రం ఏకంగా రద్దీ రోడ్డుపై (Man skateboarding on busy road) స్కేట్ బోర్డింగ్ చేసేశాడు. అది కూడా ఏదో చేశాం అంటే చేశాము అన్నట్లు కాకుండా.. అన్ని వాహనాలకంటే వేగంగా దూసుకెళ్తూ అందరినీ షాక్‌‌కు గురి చేశాడు. వాహనాలు వెళ్తున్నా కూడా వాటి మధ్యలో నుంచి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో బైకు, కారు, లారీ వంటి వాహనాలను కూడా దాటుకుంటూ దూసుకుపోయాడు. మధ్య మధ్యలో వాహనాలను పట్టుకుని వేగాన్ని పెంచడం, కొన్నిసార్లు కాలి సాయంతో ముందుకు వెళ్లాడు. చూస్తుంటే అతను స్కేట్ బోర్డింగ్ చేసినట్లు కాకుండా.. కారు నడిపినట్లుగా అనిపించింది.


ఇలా ఆ వ్యక్తి చూస్తుండగానే చాలా దూరం అలా అధిక వేగంతో దూసుకెళ్తూనే ఉన్నాడు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉంది’.. అంటూ కొందరు, ‘ఇలాంటి ప్రయోగాలు ఎవరూ చేయొద్దు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1900కి పైగా లైక్‌లు, 3.54 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 07:33 PM