Share News

Farmer Experiment Video: చిన్న ట్రిక్‌తో.. పెద్ద సమస్యకు చెక్.. ఈ రైతు తెలివి మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Aug 19 , 2025 | 07:23 PM

ఓ రైతు తన పొలంలో పంటకు నీరు పెడుతున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. అతను చేస్తున్న పనిలో వింతేమీ లేకున్నా ఆ పనిని చేసే విధానమై అందరి దృష్టినీ ఆకర్షించడానికి కారణమైంది. ఇంతకీ ఇతను చేసిన ప్రయోగం ఏంటో మీరే చూడండి..

Farmer Experiment Video: చిన్న ట్రిక్‌తో.. పెద్ద సమస్యకు చెక్.. ఈ రైతు తెలివి మామూలుగా లేదుగా..

కొందరు రైతులు తెలివిగా చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. పొలాల్లోకి అడవి జంతువులు రాకుండా వింత వింత ఏర్పాట్లు చేసే వారిని చూస్తుంటాం. అలాగే గడ్డి కోయడం, నీళ్లు పట్టడం, పురుగు మందులు కొట్టడం తదితర పనులను ఎంతో సులభంగా చేసేస్తుంటారు. ఇందుకోసం వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి రైతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ రైతు పంటకు నీళ్లు పెట్టే విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఈ రైతు తెలివి మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ రైతు తన పొలంలో పంటకు నీరు పెడుతున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. అతను చేస్తున్న పనిలో వింతేమీ లేకున్నా ఆ పనిని చేసే విధానమై అందరి దృష్టినీ ఆకర్షించడానికి కారణమైంది.


సాధారణంగా పంట పొలానికి నీరు (Farmer Watering Crops) పెట్టే సమయంలో.. ఒక వైపు నుంచి మరో వైపునకు నీటిని మళ్లించడానికి మట్టిని గట్టుగా పోయడం చూస్తుంటాం. అయితే ఓ వ్యక్తి ఇందుకోసం వినూత్నమైన ట్రిక్ వాడాడు. ఓ కర్రకు పాలిథిన్ కవర్ కట్టుకుని వచ్చిన అతను.. దాన్ని కాలువలో అడ్డుగా పెట్టాడు. దీంతో ఆ నీరంతా వేరే దిశగా ప్రయాణించింది. మామూలుగా ఇందుకోసం మట్టి పోయాల్సి ఉంటుంది.


అయితే అంత కష్టం లేకుండా ఇతను ఎంతో సింపుల్‌గా నీటిని ఇలా మళ్లించేశాడన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ రైతు ట్రిక్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఈ టెక్నిక్ రైతులకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20 వేలకు పైగా లైక్‌లు, 1.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 19 , 2025 | 07:23 PM