Stunt Viral Video: ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..
ABN , Publish Date - Aug 20 , 2025 | 07:39 AM
ఓ వ్యక్తి కాలువ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని చకచకా ఎక్కేశాడు. ఇది చూసి అంతా విద్యుత్ లైన్లు రిపేర్ చేయడానికి ఎక్కుతున్నారేమో అని అనుకున్నారు. కానీ చివరకు ఇతను చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో కొందరు, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వాలనే ఉద్దేశంతో మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేయడం సర్వసాధారనమైంది. ఇందులోనూ కొందరు చిత్రవిచిత్రమైన స్టంట్స్‌ను ప్లాన్ చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి స్తంభం పైకి ఎక్కి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఇదెక్కడి సరదారా నాయనా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కాలువ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని చకచకా ఎక్కేశాడు. ఇది చూసి అంతా విద్యుత్ లైన్లు రిపేర్ చేయడానికి ఎక్కుతున్నారేమో అని అనుకున్నారు. కానీ ఆ స్తంభానికి ఎలాంటి విద్యుత్ లైన్లు లేకపోవడంతో ఎందుకు ఎక్కడబ్బా.. అని అలాగే చూస్తుండిపోయారు.
స్తంభం పైకి ఎక్కిన అతను దానిపై చాలా సేపు మోకాళ్లపై కూర్చున్నాడు. ఆ తర్వాత లేచి నిలడ్డాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు. అయితే కాసేపటి తర్వాత స్తంభంపై నుంచి నేరుగా (Man jumps from Electric pole into canal) పక్కనే ఉన్న కాలువలోకి దూకేశాడు. కాలువలో ఈత కొట్టేందుకు ఇలా ప్రమాదకరంగా స్తంభం పైకి ఎక్కి దూకేశాడని అప్పుడు అర్థమవుతుంది. ఈ స్తంభంపై నిలబడ్డ క్రమంలో ఏమాత్రం అదుపు తప్పినా కిందపడి గాయాలయ్యే ప్రమాదం ఉండేది.
ఇతడు చేసిన ఈ స్టంట్ చూసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘లైక్‌లు, వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు’.. అంటూ కొందరు, ‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 31 వేలకు పైగా లైక్‌లు, 5.62 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
చిరుత ఎంత చురుకైనదో చూశారా.. చెట్టు పైనుంచి మాంసం పడిపోగానే..
చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి