Online Betting Games: ఆన్‌లైన్‌ బెట్టింగ్ ఇక నేరమే.. గేమింగ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

ABN, Publish Date - Aug 19 , 2025 | 10:02 PM

ఆన్‌లైన్ బెట్టింగ్‌ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ను నేరంగా పరిగణిస్తూ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది.

ఆన్‌లైన్ బెట్టింగ్‌ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ను నేరంగా పరిగణిస్తూ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ బిల్లను రేపు లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్‌కు బానిసలై కొందరు అప్పుల ఊబిలో చిక్కుకోగా.. మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ఈ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు.

Updated at - Aug 19 , 2025 | 10:03 PM