Leopard Viral Video: చిరుత ఎంత చురుకైనదో చూశారా.. చెట్టు పైనుంచి మాంసం పడిపోగానే..
ABN , Publish Date - Aug 19 , 2025 | 09:06 PM
రెండు చిరుతలు జింకలను వేటాడి చెట్టు మీదకు తీసుకెళ్లి దాచుకున్నాయి. జింక కళేబరాలను చెట్టు కొమ్మలపై పెట్టుకుని, తినేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇంతలో ఓ జింక కళేబరం చెట్టు పైనుంచి జారి కిందపడుతుంది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
చిరుత అంటేనే వేగానికి మారుపేరు అని చెబుతాం. కళ్లు చెదిరే వేగంతో పరుగులు తీస్తూ వేటాడటంలో చిరుతకు మించిన జంతువు లేదంటే అతిశయోక్తి కాదు. ఎంతో వేగంతో వేటాడే చిరుతలు.. కొన్నిసార్లు అంతే తెలివితో వేటాడుతుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ చిరుత చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. అప్రమత్తత అంటే ఇదేనేమో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రెండు చిరుతలు జింకలను వేటాడి చెట్టు మీదకు తీసుకెళ్లి దాచుకున్నాయి. జింక కళేబరాలను చెట్టు కొమ్మలపై పెట్టుకుని, తినేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇంతలో ఓ జింక కళేబరం చెట్టు పైనుంచి జారి కిందపడుతుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న రెండో చిరుత వెంటనే అలెర్ట్ అవుతుంది.
క్షణాల వ్యవధిలో కిందకు దూకి, జింక కళేబరాన్ని (Leopard carrying dead deer up tree) నోట కరుచుకుని చెట్టు పైకి తీసుకెళ్తుంది. ఇదంతా క్షణాల వ్యవధిలో జరిగిపోతుంది. అప్పటికే జింక మాంసం కోసం అక్కడ వేచి ఉన్న హైనాలు దీంతో నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అంత బరువున్న జింక కళేబరాన్ని ఆ చిరుత ఎంతో అవలీలగా చెట్టుపైకి తీసుకెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఈ చిరుత టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘చిరుత చురుకుదనం చూస్తే షాకవ్వాల్సిందే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.4 మిలియన్‌కు పైగా లైక్‌లు, 69 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..
కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి