Kitchen Hacks: ఈమె తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. పాడైన హాట్ బాక్స్‌ను పనికొచ్చేలా చేసిందిగా..
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:52 PM
ఓ మహళ అతి తెలివి చూసి అంతా అవాక్కవుతున్నారు. హాట్ బాక్స్‌లు పాడైతే ఎవరైనా ఏం చేస్తారు.. రిపేరు చేయడమో.. లేక పక్కన పడేయడమో చేస్తారు కదా. కానీ ఈమె దాని రూపురేఖలు మార్చేసి అంతా అవాక్కయ్యేలా చేసింది..
వంటింట్లో వంట చేసే మహిళలు.. అప్పుడప్పుడూ వారి బుర్రకు పని చెబుతుంటారు. ఈ క్రమంలో వారు చేసే అద్భుతాలు అన్నీఇన్నీ కావు. రూపాయి ఖర్చు కాకుండా ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. కొందరైతే పనికిరావని పక్కన పడేసిన వస్తువులను తిరిగి వాడుకలోకి తెస్తుంటారు. ఇలాంటి తెలివైన మహిళలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ పాడైన హాట్‌బాక్స్‌ను తిరిగి వినియోగంలోకి తెచ్చిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహళ అతి తెలివి చూసి అంతా అవాక్కవుతున్నారు. హాట్ బాక్స్‌లు (old hot box) పాడైతే ఎవరైనా ఏం చేస్తారు.. రిపేరు చేయడమో.. లేక పక్కన పడేయడమో చేస్తారు కదా. కానీ ఈమె దాని రూపురేఖలు మార్చేసి అంతా అవాక్కయ్యేలా చేసింది.
పాడైన బాక్స్‌ను చేతిలోకి తీసుకున్న ఆమె.. కాసేపు తేరిపారా చూసి, చివరికి దాన్ని ఎలా చేయాలో ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఓ కత్తిని పొయ్యి మీద వేడి చేసి.. ఆ తర్వాత ఆ కత్తితో హాట్ బాక్స్ చుట్టూ ఉన్న ఫైబర్‌ను కోసేసింది. మధ్య మధ్యలో కత్తిని వేడి చేస్తూ హాట్ బాక్స్ చుట్టూ (Woman cutting an old hot box with knife) ఉన్న ఫైబర్‌ను కోసేసింది. ఫైనల్‌గా అందులో ఉన్న స్టీల్ గిన్నెను బయటికి తీసి శుభ్రం చేసింది.
ఇలా పాడైన హాట్ బాక్స్‌ను తళతళా మెరిసే గిన్నెలా మార్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ మహిళ తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘పాత హాట్‌బాక్స్‌ను అద్భుతంగా మార్చిందిగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3200కి పైగా లైక్‌లు, 1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..
చిరుత ఎంత చురుకైనదో చూశారా.. చెట్టు పైనుంచి మాంసం పడిపోగానే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి