Share News

Voter ID card: మీ పాత ఓటరు కార్డును.. పీవీసీ స్టైల్లో మార్చాలనుందా.. అయితే సింపుల్‌గా ఇలా చేయండి..

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:08 PM

ఓటరు ఐడీ కార్డులు ఒకప్పుడు పేపర్‌తో తయారు చేసేవారు. దీంతో అవి తొందరగా పాడవమో, చిరిగిపోవడమో జరిగేవి. దీంతో ఎన్నికల్ కమిషన్ ఓటరు కార్డుల తయారీలో అధునాతన విధానాన్ని తీసుకొచ్చింది. శాశ్వతంగా ఉండేలా పీవీసీ కార్డులను అందుబాటులోకి తెస్తోంది.

Voter ID card: మీ పాత ఓటరు కార్డును.. పీవీసీ స్టైల్లో మార్చాలనుందా.. అయితే సింపుల్‌గా ఇలా చేయండి..

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి వద్దా ఓటరు ఐడీ కార్డు ఉంటుంది. అయితే చాలా మంది వద్ద ఇప్పటికీ పాత ఐడీ కార్డులో ఉంటాయి. ఇంకొంతమంది వద్ద ఉండే కార్డులు పూర్తిగా పాడై ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఎలక్షన్ కమిషన్.. పీవీసీతో కూడిన ఓటరు ఐడీ కార్డులను అందిస్తోంది. ఈ కార్డులు చాలా కాలం మన్నిక రావడంతో పాటూ నీటిలో తడిసినా కూడా ఏమీ కాదు. మీ పాత కార్డును ఉచితంగా పీవీసీ కార్డుగా మార్చుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


ఓటరు ఐడీ కార్డులు (Voter ID cards) ఒకప్పుడు పేపర్‌తో తయారు చేసేవారు. దీంతో అవి తొందరగా పాడవమో, చిరిగిపోవడమో జరిగేవి. దీంతో ఎన్నికల్ కమిషన్ ఓటరు కార్డుల తయారీలో అధునాతన విధానాన్ని తీసుకొచ్చింది. శాశ్వతంగా ఉండేలా పీవీసీ (PVC) కార్డులను అందుబాటులోకి తెస్తోంది. ఒకప్పుడు నిలువుగా ఉన్న కార్డులను.. ప్రస్తుతం పీవీసీలోకి మార్చి పాన్ కార్డు తరహాలో రూపొందిస్తున్నారు. అలాగే కార్డులపై హోలోగ్రామ్, QR కోడ్ వంటి అధునాతన సెక్యూరిటీ ఫీచర్లను ముంద్రించారు. కొత్త ఐడీ కార్డు కోసం ఇలా చేయడండి..

Voter-ID-card.jpg


  • ముందుగా Google లో Voter's Service Portal లింక్‌పై క్లిక్ చేసి.. వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

  • ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో సైన్ అప్ చేయడం కోసం మీ ఖాతాను క్రియేట్ చేసుకోవాలి. ఇందుకోసం మీ ఇమెయిల్, ఐడీ, ఫోన్ నంబర్‌ను ఎంటర్‌ చేసుకోవాలి.

  • సైన్ అప్ చేసిన తర్వాత మీ ఖాతాలోకి సైన్ ఇన్ చేసి.. ఫారం 8పై క్లిక్ చేయాలి.

  • అందులో మీరు ఎవరి ఓటరు ఐడీ కార్డు మార్చుకోవాలనుకుంటున్నారో నమోదు చేయాలి. ఒకవేళ మీదే అయితే సెల్ఫ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

  • తర్వాత మీ EPIC నంబర్‌ను నమోదు చేయాలి.

  • ఆ తర్వాత కొత్త ఓటరు కార్డు కావాలా లేదా పాత కార్డును మార్చాలనుకుంటున్నారా అని ఉంటుంది. అందులో EPIC భర్తీ సమస్యను ఎంచుకోవాలి.

  • తర్వాతి పేజీలో మీకు సంబంధించిన సమాచారం కనిపిస్తుం. ఆ తర్వాత నెక్ట్స్ పై క్లిక్ చేయాలి.


చివరగా మీకు అక్కడ.. కొత్త కార్డు ఎందుకు ఎంచుకుంటున్నారని ఉంటుంది. ఇక్కడ రెండో ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ ఫారం సమర్పించబడుతుంది. అలాగే మీకు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ కూడా ఇవ్వబడుతుంది.

ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయిన తర్వాత మీకు అభ్యర్థన సంఖ్య వస్తుంది. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ సంఖ్య ఆధారంగా మీ కొత్త కార్డుకు సంబంధించిన వివరాలను ఎప్పికప్పుడు ట్రాక్ చేయవచ్చు. కొత్త కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి 15 నుంచి 20 రోజుల్లో కార్డు నేరుగా ఇంటికే వస్తుంది.


ఇవి కూడా చదవండి..

ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..

చిరుత ఎంత చురుకైనదో చూశారా.. చెట్టు పైనుంచి మాంసం పడిపోగానే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 20 , 2025 | 12:09 PM