Man dies while urinating: ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మూత్రం పోస్తున్నారా.. సూర్యాపేటలో ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:51 AM
భారీ వర్షాల కారణంగా అనేక మంది వివిధ రకాల ప్రమాదాలకు గురవుతున్నారు. మ్యాన్‌హోల్స్‌లో పడి కొందరు, విద్యుత్ లైన్లు తెగి పడి మరికొందరు ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం. తాజాగా, తెలంగాణలోని సూర్యాపేటలో ఘోరం జరిగింది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా అనేక మంది వివిధ రకాల ప్రమాదాలకు గురవుతున్నారు. మ్యాన్‌హోల్స్‌లో పడి కొందరు, విద్యుత్ లైన్లు తెగి పడి మరికొందరు ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం. తాజాగా, తెలంగాణలోని సూర్యాపేటలో ఘోరం జరిగింది. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మూత్రం పోసిన ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై చనిపోయాడు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని (Telangana) సూర్యాపేట ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటీవల హైదరాబాద్ నగరంలో కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో విద్యుత్ షాక్ కారణంగా ఐగుగురు భక్తులు చనపోయిన విషయం తెలిసిందే. అలాగే పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం చూశాం. ఈ ఘటనలు మరువక ముందే సూర్యాపేటలో విద్యుత్ ప్రమాదం సంభవించింది.
వర్షాల కారణంగా ఈ ప్రాంతం మొత్తం ఎక్కడ చూసినా వరద నీరు నిల్వ చేరింది. ఈ క్రమంలో ఓ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కూడా వరద నీరు వచ్చి చేరింది. అయితే ఇది గమనించని చక్రధర్ (50) అనే వ్యక్తి (Man urinated at transformer) అక్కడ మూత్రం పోశాడు. దీంతో అతడు విద్యుత్ షాక్‌కు (Electric shock) గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. గిలగిలా కొట్టుకుంటున్న అతన్ని చూసిన స్థానికులు.. పరుగెత్తుకుంటూ వచ్చి విద్యుత్ నిలిపేశారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.
ఈ ఘటనతో ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వర్షాలు పడే సమయంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, చెట్ల వద్దకు వెళ్లకూడాడని అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరి వెళ్లాల్సి వచ్చిన సందర్భాల్లో ఎలాంటి వస్తువులను ముట్టుకోకుండా, ఇలాంటి వస్తువులకు దూరంగా ఉండాలని చెబుతన్నారు. చక్రధర్ మృతితో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..
For More Telangana News And Telugu News