Accident Viral Video: ఒకరి పొరపాటుకు ఇంకొకరు బలవడమంటే ఇదే.. ఇతడికేమైందో చూడండి..
ABN , Publish Date - Aug 20 , 2025 | 09:21 AM
ఓ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడడంతో వాహనదారులు ఆగుతారు. వారిలో ఓ బైకర్ మందు వైపు ఆగి, సిగ్నల్ కోసం వేచి చూస్తుంటాడు. కాసేపు ఉంటే గ్రీన్ సిగ్నల్ పడుతుందనగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
కొన్నిసార్లు ఒకరి పొరపాటు ఇంకొకరికి ప్రాణసంకటమవుతుంటుంది. ఇలాంటి వారు తాము తప్పు చేయడమే కాకుండా ఎదుటిని వారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంటారు. కొన్నిసార్లు చిన్న తప్పులు కూడా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బైకర్ నాలుగు రోడ్ల కూడలిలో వాహనం నిలుపుకొని ఉన్నాడు. ఇంతలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ (Red signal at the junction) పడడంతో వాహనదారులు ఆగుతారు. వారిలో ఓ బైకర్ మందు వైపు ఆగి, సిగ్నల్ కోసం వేచి చూస్తుంటాడు. కాసేపు ఉంటే గ్రీన్ సిగ్నల్ పడుతుందనగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
ఎడమ వైపు మార్గం నుంచి దూసుకొచ్చిన కారు.. కూడలి వద్దకు రాగానే వేగాన్ని అదుపు చేయలేక డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వాహనం గిర్రున మలుపు తిరిగి బైకర్ ఉన్న వైపు దూసుకొస్తుంది. నేరుగా వచ్చి (Car hits biker) బైకర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ బైకర్ ధబేల్‌మని అవతలి రోడ్డు వైపు పడిపోతాడు. అప్పుడే ఓ కారు వచ్చి అక్కడ ఆగిపోతుంది. ఈ క్రమంలో ఏమాత్రం అటూ, ఇటూ అయినా ఆ వ్యక్తి కారు కింద పడి ఉండేవాడు. అయితే ఈ ఘటనలో బైకర్ స్వల్పగాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎవరో చేసిన తప్పునకు ఇంకెవరో బలవడమంటే ఇదే’.. అంటూ కొందరు, ‘కారు డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 220కి పైగా లైక్‌లు, 22వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
చిరుత ఎంత చురుకైనదో చూశారా.. చెట్టు పైనుంచి మాంసం పడిపోగానే..
చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి